నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాక్ షో ద్వారా కొన్ని కొత్త పరిచేయాలను ఏర్పరుచుకున్నారు. ఈ షోకి గెస్ట్ గా వచ్చి తనతో భయపడుతూ మాట్లాడిన యంగ్ హీరోలు విశ్వక్ సేన్ , సిద్దు జొన్నలగడ్డ లతో బాలయ్య ఫ్రెండ్ షిప్ చేస్తూ వారితో చాలా క్లోజ్ గా ఉంటున్నాడు. విశ్వక్ సేన్ ధమ్కీ ట్రైలర్ లాంచ్ గా హాజరై ట్రైలర్ ను రిలీజ్ చేశాడు బాలయ్య. అలాగే సిద్దు జొన్నలగడ్డ తో కూడా ఫ్రెండ్ షిప్ మొదలు పెట్టాడు.
విశ్వక్ , సిద్దులకు నిన్న ‘వీర సింహా రెడ్డి’ సక్సెస్ మీట్ కి బాలయ్య నుండి స్వయంగా ఇన్విటేషన్ అందింది . దీంతో ఇద్దరు కుర్ర హీరోలిద్దరు ఈవెంట్ లో బాలయ్య ను అతుక్కొని కూర్చున్నారు. తమ అభిమానం చాటుకుంటూ స్పీచ్ లిచ్చారు. ఈవెంట్ తర్వాత మైత్రి నిర్మాతలు టీంకు ఓ పార్టీ ఏరేంజ్ చేశారు. అక్కడ కూడా సిద్దు , విశ్వక్ సేన్ లు కనిపించారు. బాలయ్య పార్టీ చేసుకొని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.
ఏదేమైనా కుర్ర హీరోలతో బాలయ్య కొత్త ఫ్రెండ్ షిప్ ఎప్పటి వరకు కొనసాగుతుందో ? మునుముందు వీరిద్దరికీ బాలయ్య ఎలాంటి సపోర్ట్ అందిస్తాడో చూడాలి.
ఇవి కూడా చదవండి…