నితిన్ భుజానికి గాయం..నాకు తెలియ‌దంటున్న‌ ర‌ష్మీక‌

111
rashimka nithin

యంగ్ హీరో నితిన్ ఇటివ‌లే న‌టించిన సినిమాలు వ‌రుస‌గా ప‌రాజ‌య‌మ‌య్యాయి. చివ‌ర‌గా ఆయ‌న చేసిన సినిమా శ్రీనివాస క‌ళ్యాణం కూడా నిరాశ‌నే మిగిల్చింది. స‌తీశ్ వేగ‌శ్న ఈచిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. కొన్ని రోజుల గ్యాప్ త‌ర్వాత నితిన్ ఓ సినిమాకు సైన్ చేశాడు. ఛ‌లో సినిమా ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల‌కు ఆయ‌న గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఈమూవీలో నితిన్ కు జోడిగా ర‌ష్మీక మంద‌న‌ను ఎంపిక చేశారు.

nithin rashmika

తాజాగా ఉన్న స‌మాచారం ప్ర‌కారం ఈచిత్రానికి భీష్మ అనే టైటిల్ ను ఖ‌రారు చేసిన‌ట్లు తెలుస్తుంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని వ‌చ్చే నెల‌లో రెగ్యూల‌ర్ షూటింగ్ ప్రారంభించ‌నున్న‌ట్లు స‌మాచారం. అయితే నితిన్ భుజానికి గాయమైన కారణంగా ఆలస్యమైందనీ .. వచ్చేనెలలో సెట్స్ పైకి వెళతామని తాజాగా వెంకీ కుడుముల ట్వీట్ చేశాడు.

nithin venky kudumula

ఆయ‌న ట్వీట్ చూసిన ర‌ష్మీక వెంట‌నే స్పందిచింది. అయ్యో .. నితిన్ భుజానికి గాయమైందా .. నాకు తెలియదు సార్ .. ఇప్పుడు ఆయనకి ఎలా వుంది? ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని ట్వీట్ చేసింది. ర‌ష్మీక ట్వీట్ పై నితిన్ స్పందిస్తూ ర‌ష్మీక నేను ఇప్పుడు బాగానే ఉన్నాను ..షూటింగ్ లో క‌లుసుకుందాం అని ట్వీట్ చేశాడు. ఈసినిమాతో అయిన నితిన్ హిట్ కొడ‌తాడో లేదో చూడాలి మ‌రి.