కోహ్లీకి మంచి భవిష్యత్తు ఉంది:కుంబ్లే

205
kohli kumble
- Advertisement -

టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీకి మంచి భవిష్యత్ ఉందని..అతడు పరిణతి చెందిన క్రికెటరని మాజీ కోచ్‌ అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డారు. వివాదాల నుండి ఎలా బయటపడాలో కోహ్లీకి బాగా తెలుసన్నారు. సచిన్‌తో తాను కోహ్లీని పోల్చనని..ఇద్దరి గురించి పోల్చుతున్నప్పుడు వారి గురించి పూర్తిస్థాయిలో తెలుసుండాలన్నారు.

ఆటగాడిగా కోహ్లీ ప్రతిభ అత్యున్నత స్థానంలో ఉంటుందని.. మ్యాచ్‌ పరిస్థితులను తన అధీనంలోకి తెచ్చుకుంటాడని తెలిపారు. అన్ని ఫార్మాట్లలోను అదరగొట్టే సత్తా కోహ్లీలో ఉందన్నారు. క్రికెట్‌ అభిమానుల అభిరుచులు మారుతున్నాయని..కోహ్లీ,సచిన్‌ వీరిద్దరి పోల్చాల్సిన అవసరం లేదన్నారు.

పెర్త్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆసీస్‌ సారథి టిమ్‌ పైన్‌,కోహ్లీకి మధ్య జరిగిన మాటల యుద్ధం తర్వాత కోహ్లీని వివాదాలు చుట్టుముట్టాయి. ఆసీస్‌ మాజీలు కోహ్లీపై విమర్శల దాడి చేస్తున్నారు. దీనిపై అనిల్‌ కుంబ్లే స్పందించి కోహ్లీకి కితాబిచ్చారు.

- Advertisement -