వ‌చ్చే నెల‌లో నితిన్ ‘భీష్మ’ ప్రారంభం..

82
nithin

యంగ్ హీరో నితిన్ ప్ర‌స్తుతం శ్రీనివాస క‌ళ్యాణం అనే సినిమాలో న‌టిస్తున్నాడు. శ‌త‌మానం భ‌వతి సినిమా ద‌ర్శ‌కుడు స‌తీశ్ వేగ‌శ్న ఈమూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. నితిన్ స‌ర‌స‌న హీరోయిన్ గా రాశి ఖ‌న్నా న‌టిస్తుంది. ప్ర‌స్తుతం ఈసినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది.

srinivasa kalyanam

త్వ‌ర‌లోనే ఈసినిమా విడుద‌లకు సంబంధించిన తేదీల‌ను ఖారారు చేయ‌నున్నారు ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు. ఈచిత్రానికి మిక్కి జే మేయ‌ర్ సంగీతం అందిస్తున్నారు. నితిన్ త‌న త‌ర్వాతి చిత్రం ఛ‌లో సినిమా ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్నాడు. వ‌చ్చే నెల‌లో ఈసినిమాకు సంబంధించిన పూజా కార్య‌క్ర‌మాలు ప్రారంభించి రెగ్యూల‌ర్ షూటింగ్ ను ప్రారంభించ‌నున్నారు.

nitihi, venky

ఇప్ప‌టికే ఈచిత్రానికి సంబంధించిన స్క్రీప్ట్ వ‌ర్క్ పూర్త‌యింది. ఈసినిమాకు భీష్మ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇక వెంకీ కుడుముల తెర‌కెక్కించిన ఛ‌లో చిత్రం భారీ విజ‌యాన్ని అందుకున్న విషయం తెలిసిందే. త్వ‌ర‌లోనే ఈసినిమాకు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను ప్ర‌క‌టించ‌నున్నారు.