నాటా ఐడల్ 2018 విజేత కు ఘన సన్మానం

206
NATA IDOL 2018

నాటా ఐడ‌ల్ 2018 విజేత చిన్నారి కొత్త‌మాసు విష్ణుప్రియ కు క‌ళాభార‌తి న్యూజెర్సీ ఆధ్వ‌ర్యంలో ఘ‌న స‌న్మానం నిర్వ‌హించారు. ఎడిస‌న్ న్యూ జెర్సీ లో జ‌రిగిన ఈకార్య‌క్ర‌మానికి క‌ళాభార‌తి సంఘం స‌భ్యులు, వివిధ తెలుగు సంఘాల పెద్ద‌లు హాజ‌ర‌య్యారు. నాటా అధ్య‌క్షుడు శ్రీ రాజేశ్వ‌ర్ రెడ్డి గంగ‌సాని ఆధ్వ‌ర్యంలో నాటా మెగా క‌న్వేన్ష‌న్ ఫిల‌డెల్ఫియాలో ఈకార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. నాటా వారు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ఈపోటీల‌కు సంగీత ద‌ర్శ‌కులు క‌ళ్యాణ్ మాలిక్, ప్ర‌ముఖ గేయ ర‌చ‌యిత చంద్ర‌బోస్ లు న్యాయ నిర్ణేత‌లుగా వ్య‌వ‌హ‌రించారు.

vishnu priya

నాటా ఐడ‌ల్ లో విజేత‌గా నిలిచిన విష్ణుప్రియకు త‌న త‌ర్వాతి సినిమాలో సింగ‌ర్ గా అవ‌కాశం ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు సంగీత ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ మాలిక్. క‌ళాభార‌తి ప్ర‌తి సంవ‌త్స‌రం నిర్వ‌హించే వినాయ‌క చ‌వితి, హోలీ, దీపావ‌ళి వంటి పండుగ జ‌రిపే సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌లో చిన్న‌ప్ప‌టి నుండి పాల్గొంటున్న విష్ణుప్రియా ఈ విజ‌యాన్ని అందుకోవ‌డం చాలా సంతోషంగా ఉంద‌న్నారు క‌ళాభార‌తి స‌భ్యులు.

vishnu priya

ముందుముందు విష్ణు ప్రియ మ‌రిన్ని అవార్డులు అందుకోవాల‌ని కోరుతున్నామ‌న్నారు. ఈస‌న్మాన కార్య‌క్ర‌మంలో వివిధ సంఘాల సభ్యుల‌తో పాటు తెలుగు జాతీయ సంఘాల‌యిన నాటా(ఉత్తర అమెరికా తెలుగు సమితి ), ఆటా (అమెరికా తెలుగు సంఘము) , తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘము ) సంఘాల స‌భ్యులు పాల్గోన్నారు. ఈకార్య‌క్ర‌మంలో ప‌లువురు చిన్నారులు పాట‌లు, నృత్యాల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు.