‘ఎన్టీఆర్’ లో కీర్తి సురేష్..

307
ntr biopic, keerthi suresh

న‌ట‌సార్వ‌భౌముడు, మాజీ ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క‌రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఎన్టీఆర్ బ‌యోపిక్ తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఈసినిమాకు సంబంధించిన రెగ్యూల‌ర్ షూటింగ్ ను ఇటివ‌లే ప్రారంభించారు. ఈమూవీకి ద‌ర్శ‌కుడు క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా..న‌టుడు, ఎమ్మెల్యే బాల‌కృష్ణ త‌న సొంత బ్యాన‌ర్ లో నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ జీవితంలో కీల‌క పాత్ర పోషించిన ప‌లువురి పాత్ర‌ల‌ను సినిమాలో కీల‌కంగా చూపించ‌నున్నారు. ఎన్టీఆర్ మొద‌ట‌గా న‌టించిన మ‌న‌దేశం సెట్లో ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించారు.

NTR-Biopic

ఈమూవీలో న‌టిస్త‌న్న న‌టీన‌టుల‌ను చూస్తుంటే అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. సీనియ‌ర్ న‌టీన‌టులంద‌రూ ఈమూవీలో న‌టిస్తున్నారు. ఎన్టీఆర్ పాత్ర‌లో బాల‌కృష్ణ న‌టిస్తుండ‌గా, ఆయ‌న మొద‌టి స‌తీమ‌ణి బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో బాలీవుడ్ న‌టీ విద్యాబాల‌న్, అక్కినేని నాగేశ్వ‌ర్ రావు పాత్ర‌లో సుమంత్, చంద్ర‌బాబు నాయుడు పాత్ర‌లో ద‌గ్గుబాటీ రానా, ప్ర‌కాశ్ రాజ్, మోహ‌న్ బాబు, సీనియ‌ర్ న‌రేష్ ఇలా ప‌లువురు న‌టీన‌టులు ఎన్టీఆర్ బ‌యోపిక్ న‌టిస్తున్నారు.

keerthi-suresh

ఇక ఎన్టీఆర్ న‌ట ప్ర‌స్థానంలో సావిత్రి పాత్ర కూడా ఉంది. వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో చాలా సినిమాలు వ‌చ్చాయి. దింతో ఈబ‌యోపిక్ లో సావిత్రి పాత్ర ఉండ‌నుంది. సావిత్ర పాత్ర‌లో కీర్తి సురేష్ ను తీసుకున్న‌ట్లు స‌మాచారం. ఇటివ‌లే వ‌చ్చిన మ‌హాన‌టి సినిమాలో సావిత్రి పాత్ర‌లో కీర్తి సురేష్ న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌ధం ప‌ట్టారు. అచ్చం సావిత్రిలానే ఉందంటూ మైమ‌రిచిపోయారు. అందుకే మ‌రోసారి ఎన్టీఆర్ బ‌యోపిక్ లో కూడా కీర్తి సురేష్ సావిత్రి పాత్ర‌లో న‌టించ‌నుంది. ఈపాత్ర‌కోసం కీర్తి సురేష్ ను సంప్ర‌దించ‌గా ఆమె కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింద‌ని స‌మాచారం. ఈమూవీలో ర‌కుల్ ప్రీత్ సింగ్ ఓ ప్రత్యేక‌మైన సాంగ్ లో క‌నిపించ‌నుంద‌ని తెలుస్తుంది.