శ్రీలీల పై ఆ కుర్ర హీరోకి జలసీ

61
- Advertisement -

హీరోయిన్ శ్రీలీల కి అదృష్టం మామూలుగా లేదు. మహేష్ సరసన మెయిన్ హీరోయిన్ గా శ్రీలీల ప్రమోట్ అయింది. మ‌హేష్ బాబు, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న గుంటూరు కారం సినిమాలో మొదట మెయిన్ హీరోయిన్ పూజా హెగ్డే. ఐతే, ఏం జరిగిందో ఏమో గానీ, పూజా హెగ్డే ప్లేస్ లో మీనాక్షి చౌదరి వచ్చింది. దాంతో అందరూ.. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ మీనాక్షి చౌదరి అనుకున్నారు. కానీ, ఇందులో నిజం లేదు. పూజా హెగ్డే చేయాల్సిన పాత్ర శ్రీలీల చేస్తోంది. శ్రీలీల చేయాల్సిన పాత్ర ఇప్పుడు మీనాక్షి చౌదరి చేస్తోంది. అంటే.. గుంటూరు కారం సినిమాలో ఇప్పుడు మెయిన్ హీరోయిన్ శ్రీలీలనే.

పైగా తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో కూడా ఈ సినిమా రిలీజ్ కానుంది. పాన్ ఇండియా హీరోయిన్ గా కూడా గుంటూరు కారం శ్రీలీల పరిచయం కాబోతుంది. ఎలాగూ శ్రీలీల ముద్దుగా బబ్లీగా, మెరుపులాంటి చూపులతో పక్కింటి పిల్ల మాదిరిగా భలే వుంటుంది. పైగా నటన విషయంలో కూడా శ్రీలీల ఏ మాత్రం తీసిపోదు. నార్త్ లో అలియా భట్ లాంటి హీరోయిన్ శైలిలో శ్రీలీల లుక్ అండ్ యాక్టింగ్ ఉంటుంది. కాబట్టి.. కాలం కలిసి వస్తే.. శ్రీలీల పాన్ ఇండియా హీరోయిన్ గా కూడా టర్న్ అవ్వొచ్చు.

Also Read:వైసీపీకి వార్నింగ్..సీట్ ఇవ్వకపోతే అంతే!

కాకపోతే.. శ్రీలీల ఎదుగుదల ఇప్పుడు ఓ కుర్ర హీరోకి అసలు నచ్చడం లేదు. హీరోయిన్ గా అడుగులు వేస్తున్న తోలి రోజుల్లోనే శ్రీలీల ఆ కుర్ర హీరోతో బాగా సాన్నిహిత్యంగా ఉండేది. అప్పట్లో ఈ కుర్ర జంట పై టాలీవుడ్ లో బలమైన గుసగుసలు కూడా వినిపించాయి. ఆ కుర్ర హీరో తండ్రి కూడా సీనియర్ హీరోనే. దాంతో ఆయన కూడా తన కొడుకుని కంట్రోల్ లో పెట్టే ప్రయత్నం చేశాడు. కానీ, ఆ కుర్ర హీరో వినలేదు. శ్రీలీలతో డేటింగ్ కూడా చేశాడు. కట్ చేస్తే.. ఇప్పుడు శ్రీలీల రేంజ్ మహేష్ తో సినిమా చేసేంత. కానీ, ఆ కుర్ర హీరోకి ఇప్పటికీ సరైన సినిమా లేదు. దాంతో శ్రీలీల ఎదుగుదల చూసి అతగాడు జలసీ ఫీల్ అవుతున్నాడట.

Also Read:సలార్ దరిదాపుల్లో లేని కల్కి..?

- Advertisement -