ట్రంప్‌కు మరోషాక్‌..ఈసారి యూట్యూబ్ వంతు!

114
trump

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే ట్రంప్ ట్విట్టర్‌ అకౌంట్‌పై శాశ్వతంగా బ్యాన్ విధించింది ట్విట్టర్‌. తాజాగా ట్రంప్ ఛాన‌ల్‌లో తాజాగా అప్‌లోడ్ చేసిన‌ కంటెంట్‌ను యూట్యూబ్ తీసివేసింది. హింస‌ను రెచ్చ‌గొడుతున్న‌ట్లుగా ట్రంప్ ఛాన‌ల్ కంటెంట్ ఉండటంతో యూ ట్యూబ్ వార్నింగ్ ఇచ్చింది. ఎన్నిక‌ల్లో మోసం జ‌రిగిన‌ట్లు ట్రంప్ వీడియోలో ఆరోపించడంతో యూ ట్యూబ్ కఠిన నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించింది.

ట్రంప్ ఛాన‌ల్‌కు సుమారు 2.77 మిలియ‌న్ల స‌బ్‌స్క్రైబ‌ర్లు ఉన్నారు. క్యాపిట‌ల్ హిల్ ఘ‌ట‌న త‌ర్వాత ట్రంప్‌కు చెందిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ల‌ను తాత్కాక‌లింగా ర‌ద్దు చేసిన విష‌యం తెలిసిందే. ఇక ట్విట్ట‌ర్ అకౌంట్‌ను పూర్తిగా డిలీట్ చేశారు.