హీరో నాని వ్యాఖ్యలకు కౌంటరిచ్చిన బొత్స..

31
botsa

న్యాచురల్‌ స్టార్‌ నాని నటించిన శ్యామ్‌సింగరాయ్‌ సినిమా రేపు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నాని శ్యామ్‌సింగరాయ్‌ సినిమా ప్రమోషన్లలో భాగంగా నిర్వహించిన మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఏపీలో భగ్గుమన్నాయి. తాజాగా నాని వ్యాఖ్యలపై వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్‌ ఇచ్చారు. సామాన్యుడికి సినిమా అందుబాలో ఉండాలనే టికెట్‌ ధరలు తగ్గించామని బొత్స అన్నారు. ఏదైనా ఇబ్బంది ఉంటే జిల్లా అధికారులను ఆశ్రయించాలని, మాకు ఇబ్బందులు ఉన్నాయని చెబితే ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు.

మార్కెట్‌లో ఏదైనా కొంటే దానికి ఎమ్మార్పీ ఉంటుంది కదా అని ఆయన అన్నారు. ప్రేక్షకులను మేమెందుకు అవమానిస్తామని, టికెట్ల ధరలను నియంత్రిస్తే అవమానించడమా..? అని ఆయన ప్రశ్నించారు. మేమింతే.. ఎంతంటే అంత వసూలు చేస్తామంటే కుదరదని ఆయన వెల్లడించారు. సినిమా చూసేవారికి మేలు చేసేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన స్పష్టం చేశారు.