తిరుమల శ్రీవారి సన్నిధిలో శ్రీలంక ప్రధాని..

93
srilanka

తిరుమలేశుడి దర్శనార్ధం శ్రీలంక ప్రధానమంత్రి మహేంద్ర రాజ పక్సే దంపతులు తిరుమలకు చేరుకున్నారు.రెండు రోజుల భారత పర్యటన నిమిత్తం తన సతిమణితో కలిసి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న రాజ పక్సే అక్కడ నుంచి రోడ్డు మార్గం గుండా తిరుమలలో శ్రీకృష్ణ అతిధిగృహం వద్దకు చేరుకోగా టీటీడి అదనపు ఈవో ధర్మా రెడ్డి మహేంద్ర రాజ పక్సే దంపతులకు ఘన స్వాగతం పలికారు.ఈ రాత్రికి తిరుమలలోనే బసచేయనున్న మహేంద్ర రాజ పక్సే రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.