ఇండియా కూటమి..మూడు కోతులు!

4
- Advertisement -

బీహార్‌లోని దర్బంగాలో సోమవారం జరిగిన ప్రజాసభలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇండియా బ్లాక్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇండియా బ్లాక్ కూటమి నేతలను “పప్పు,టప్పు,అప్పు” అంటూ ఎద్దేవా చేశారు. ఆర్‌జేడీ (RJD) మరియు కాంగ్రెస్ పేదల సమస్యలను విస్మరించాయని, బీహార్‌ను కులాల పేరుతో విభజించాయని, దేశ భద్రతను బలహీనపరచాయని అన్నారు.

మీకు మహాత్మా గాంధీ యొక్క మూడు కోతుల గురించి తెలుసు. కానీ ఈరోజు ఇండియా కూటమికి మూడు కొత్త కోతులు ఉన్నారు — పప్పు, టప్పు, అప్పుడు అన్నారు. పప్పు నిజం మాట్లాడలేడు, టప్పు సత్యాన్ని చూడలేడు, అప్పు నిజం వినలేడు అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూడలేరు, వినలేరు, చెప్పలేరు — అందుకే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వారి పాలనలో పేదలు రేషన్, సంక్షేమ పథకాలు వంటి ప్రాథమిక సదుపాయాలనుంచి దూరమయ్యారు. 2005కు ముందు కాంగ్రెస్ లేదా ఆర్‌జేడీ పాలనలో పేదవాడు అనారోగ్యానికి గురయితే చికిత్స లేక మరణించేవాడు అన్నారు.

కశ్మీర్‌ను కాంగ్రెస్ వివాదాస్పదం చేసింది…మోదీ దానిని ఉగ్రవాదం నుంచి విముక్తం చేశాడు అన్నారు. ప్రతిపక్ష పార్టీలను “రామ్ వ్యతిరేకులు” అని యోగి ఆరోపించారు. ఆర్‌జేడీ రామ్ రథయాత్రను ఆపేందుకు ప్రయత్నించింది. సమాజ్‌వాదీ పార్టీ అయోధ్యలో రామ్ భక్తులపై కాల్పులు జరిపింది. పవిత్ర నగరాన్ని రక్తంతో నింపిందిఅని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇండియా బ్లాక్ “కుటుంబ మాఫియా”లను ప్రోత్సహించి, చొరబాటుదారులను ఆహ్వానించడం ద్వారా “బీహార్ భద్రతను దెబ్బతీసే ప్రయత్నం” చేస్తోందని మండిపడ్డారు.

Also Read:అదృష్టమంటే…ఇతడిదే!

- Advertisement -