చైనాకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్​

9
- Advertisement -

తైవాన్​పై దాడి చేస్తే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో చైనాకు తెలుసని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. ముఖ్యంగా చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​కు ఈ విషయం బాగా అర్థమవుతుందని… జిన్​పింగ్​తో భేటీ జరిగిన వేళ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు ట్రంప్. తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చైనా అధికారులు తైవాన్‌కు వ్యతిరేకంగా వ్యవహరించడం మానుకున్నారని వెల్లడించారు ట్రంప్.

డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో అణు పరీక్షలను మళ్లీ ప్రారంభించాలనే తన ప్రణాళికను సమర్థించారు. రష్యా, చైనా తమ అణు ఆయుధ సంపత్తిని విస్తరించుకుంటున్న సమయంలో, అమెరికా మాత్రమే పరీక్షలు చేయకుండా ఉండలేదని ఆయన తెలిపారు. ఇతర దేశాలు తమ అణు సామర్థ్యాలను పెంచుకుంటున్నప్పుడు, పరీక్షలు చేయని దేశంగా మేము మాత్రమే ఉండలేము అని ఆయన పేర్కొన్నారు.

మాకు ఇతర ఏ దేశానికీ లేనంత అణు ఆయుధాలు ఉన్నాయి. నేను నిరాయుధీకరణ వైపు కృషి చేయాలనుకుంటున్నాను.. ఈ విషయంపై పుతిన్‌ మరియు షీ జిన్‌పింగ్‌తో కూడా మాట్లాడాను. కానీ పరీక్షలు చేయని దేశంగా మేమే ఒక్కరుగా ఉండలేము అన్నారు.

Also Read:చేవెళ్ల ప్రమాద మృతులకు ఎక్స్‌గ్రేషియా

- Advertisement -