యస్ బ్యాంకు వ్యవస్ధాపకుడు రాణా కపూర్ అరెస్ట్

389
rana-kapoor.jpeg
- Advertisement -

యస్ బ్యాంకు వ్యవస్ధాపకుడు రాణా కపూర్ అరెస్ట్ అయ్యారు. మనీ ల్యాండరింగ్ కేసులో ఈడీ శుక్రవారం సాయంత్రం ముంబైలోని ఆయన నివాసంలో సోదాలు జరిపింది. అనంతరం విచారణ కోసం ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లిన అధికారులు.. 20 గంటల విచారణ అనంతరం ఈ వేకువ జామున ఆయనను అదుపులోకి తీసుకుంది.

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు బ్యాంకు ఇచ్చిన రుణాలు నిరర్ధక ఆస్తులుగా మారడం అదేవిధంగా మరో కార్పొరేటు సంస్థకు ఇచ్చినా రుణాల్లో కపూర్‌ అక్రమాలకు పాల్పడ్డారని ఆధారాలు లభించడంతో ఈడీ కపూర్‌ను అరెస్ట్‌ చేసింది.విచారణకు సరిగా సహకరించకపోవడం వల్లే రాణా కపూర్‌ను అరెస్ట్ చేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు.

- Advertisement -