కరోనా వైరస్.. ప్రజలను చైతన్య పరుస్తున్న చోటా భీమ్

578
Chotabheem
- Advertisement -

హైదరాబాద్ కు చెందిన ప్రముఖ యానిమేషన్ కంపెనీ గ్రీన్ గోల్డ్ యానిమేషన్ కరోనా వైరస్ పైన తనదైన శైలిలో ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాన్ని చేపట్టింది. కంపెనీ సృష్టించిన అత్యంత ప్రజాదరణ పొందిన కార్టూన్ క్యారెక్టర్ చోటా భీమ్ ద్వారా కరోనా వైరస్ నేపథ్యం లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కరోనా వైరస్కు సంబంధించిన ప్రాథమిక సమాచారం తో రూపొందించిన ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తుంది.

ఈ వీడియోను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కే. తారకరామారావు ట్విట్టర్ ద్వారా ప్రజలతో పంచుకున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు అత్యంత ఇష్టపడే చోటా భీమ్ క్యారెక్టర్ ద్వారా కరోనా వైరస్ లాంటి కీలకమైన, అత్యంత ఆవశ్యకమైన అంశం పైన ప్రజలను చైతన్య పరిచేందుకు ముందుకు వచ్చిన గ్రీన్ గోల్డ్ యానిమేషన్ సంస్థను మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా అభినందించారు. ఈ చోట బీమ్ క్యారెక్టర్ ద్వారా చేపట్టిన ప్రచారం ముఖ్యంగా బడి పిల్లలు విస్తృత అవగాహనను పెంపొందిస్తుందని ఆశాభావాన్ని గ్రీన్ గోల్డ్ సంస్థ వ్యక్తం చేసింది.

- Advertisement -