ప్రాణం పోసిన..సమంత

269
Yentha Sakkagunnave Video Song Teaser
- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌-సమంత కాంబినేషన్‌లో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రంగస్థలం. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను దృశ్యకావ్యంలా మలిచేందుకు సుకుమార్ తీవ్రంగా శ్రమించాడు. సుకుమర్ దర్శక ప్రతిభ ఇప్పటివరకు వదిలిన సాంగ్ ప్రొమోల్లో అద్భుతంగా కనిపించింది. ముఖ్యంగా 1985 నాటి కాలాన్ని తలపిస్తూ వేసిన సెట్,ఆనాటి వాతావరణం ప్రతిఒక్కరికి తెగనచ్చేసింది.

అన్నికార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం మార్చి 30న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటివరకు చిత్రయూనిట్ విడుదల చేసిన సాంగ్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఎంతసక్కగున్నావే,రంగమ్మ మంగమ్మ పాటలు యూ ట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారాయి. ఈ రెండు పాటలను రెండు కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి.

తాజాగా సినిమాలోని ‘ఎంత సక్కగున్నావే’ వీడియో ప్రోమోను అభిమానులతో పంచుకుంది చిత్రయూనిట్. రామ్‌చరణ్‌, సమంతల మధ్య సన్నివేశాలు అలరిస్తున్నాయి. ఇక సమంత తన హావభావాలతో యువ హృదయాలను పిండేసింది. ఆది, అనసూయ, జగపతిబాబు కీలకపాత్రల్లో నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -