ఏడు చేపల కథ టీజర్‌..18 దాటిన వారికి మాత్రమే..

466
Yedu Chepala Katha Teaser
- Advertisement -

“మీటూ” ఉద్యమం దేశాన్ని ఉపేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు “మీటూ” ఉద్యమం ద్వారా ఎంతోమంది మహిళలు తమకు జరిగిన లైంగిక వేధింపుల్ని బహిరంగంగా చెబుతూ కొంతమందికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. కానీ ఇక్కడ టెమ్ట్ రవి మీటూ అంటూ ముందుకొస్తున్నాడు. “ఏడు చేపల కథ” చిత్రంలో టెమ్ట్ రవి అనే విభిన్నమైన పాత్రతో మెప్పించబోతున్నాడు. అడల్డ్ కామెడీ జోనర్‌లో పూర్తిగా కొత్త వారితో తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా టీజర్‌ విడుదల చేశారు.

Yedu Chepala Katha Teaser

ఈ మూవీని దర్శకుడు శామ్ జే చైతన్య విభిన్నమైన కాన్సెప్ట్‌ను రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా మలిచాడు. ఆద్యంతం ఆసక్తి కలిగించే సన్నివేశాలతో ఏడు చేపల కథ ఉండబోతుంది. త్వరలోనే ఈ చిత్రం విడుదలకానుంది. అభిషేక్ రెడ్డి, బిగ్ బాస్ ఫేం భాను శ్రీ,, ఆయేషా సింగ్, నగరం సునీల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని చరిత సినిమా ఆర్ట్స్ పతాకం మీద డా.రాకేష్ రెడ్డి గూడూరు సమర్పణలో శేఖర్ రెడ్డి, జివిఎన్ నిర్మిస్తున్నారు.

https://youtu.be/39qVyCMOI9Q

- Advertisement -