ఎట్టకేలకు అసంతృప్తుల ఒత్తిడికి తలొగ్గారు కర్ణాటక సీఎం యెడియూరప్ప. అంతా ఊహించినట్లుగానే తన సీఎం పదవికి రాజీనామా చేశారు యెడ్డీ. రాజీనామా అనంతరం మాట్లాడిన యెడ్డీ…కర్ణాటక రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ఎవరిని నియమిస్తే బాగుంటుందనే విషయంలో తాను ఎవరి పేరును సిఫారసు చేయబోనని వెల్లడించారు.
తన రాజీనామా కోసం ఎవరూ ఎలాంటి ఒత్తిడి చేయలేదని, కొత్త వారికి అవకాశం ఇవ్వడం కోసం తానే స్వచ్ఛందంగా పదవి నుంచి వైదొలిగానని ఆయన వెల్లడించారు. నూటికి నూరు శాతం కొత్త ముఖ్యమంత్రికి సహకరిస్తానని, అదేవిధంగా తన మద్దతుదారులు కూడా వచ్చే సీఎంకు 100 శాతం సహకారం అందిస్తారని స్పష్టంచేశారు.
అధిష్ఠానం కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించినా తాము అతని నాయకత్వంలో పనిచేస్తామని తెలిపిన యెడ్డీ… రాష్ట్రంలో బీజేపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడం కోసం తనవంతు ప్రయత్నం చేస్తానని చెప్పారు.