అంతా ఉహించిందే జరిగింది. మెజారిటీ లేకున్నా యాడ్యురప్ప సర్కార్‌ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు గవర్నర్ వాజుభాయ్. న్యాయనిపుణులతో చర్చించిన అనంతరం యాడ్యురప్పను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. రేపు ఉదయం 9.30 గంటలకు యాడ్యురప్ప ప్రమాణస్వీకారం చేయనున్నారు. బలనిరూపణ అనంతరం కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉంది.ఈ నెల 27 వరకు బలనిరూపణకు అవకాశం ఇచ్చారు.
బీజేపీ 104 స్ధానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించగా కాంగ్రెస్ 78,జేడీఎస్ 38 స్ధానాల్లో గెలుపొందింది. మేజిక్ ఫిగర్ 112ను ఏ పార్టీ చేరుకోక పోవడంతో హంగ్ ఏర్పడింది. అయితే జేడీఎస్ మాత్రం కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కొరగా గవర్నర్ అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు.
ప్రభుత్వం ఏర్పాటుపై న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతనే బీజేపీని గవర్నర్ ఆహ్వానించారని ఆ పార్టీ ప్రతినిధులు తెలిపారు. అయితే.. గవర్నర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్లే ఆలోచనలో కాంగ్రెస్,జేడీఎస్ ఉన్నట్లు సమాచారం.