రివ్యూ: ఏ మంత్రం వేసావె

283
Ye Mantram Vesave review
- Advertisement -

పెళ్ళిచూపులు, అర్జున్‌రెడ్డి సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. తాజాగా కొత్త దర్శకుడు శ్రీదర్‌ మర్రిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఏం మంత్రం వేసావే అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఐదేళ్ల క్రితం తీసిన ఈ సినిమాతో విజయ్ మరోసారి ప్రేక్షకులను మెప్పించాడా..? లేదా చూద్దాం

కథ:

విజయ్(విజయ్ దేవరకొండ) డిజిటల్ గేమింగ్ అంటే ప్రాణం. గాడ్జెట్సే జీవితంగా అస్సలు బాధ్యత లేకుండా బతుకుతాడు. విజయ్‌కి ఓ అమ్మాయి(శివానిసింగ్‌)తో పరిచయం ఏర్పడుతుంది..వీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్‌గా మారుతారు. విజయ్‌ని మార్చేందుకు శివాని తనతో గేమ్ ఆడి గెలవాలని ఛాలెంజ్ చేస్తుంది. సీన్ కట్ చేస్తే…శివాని కిడ్నాప్‌కు గురవుతుంది..?ఆమెను కిడ్నాప్ చేసింది ఎవరు..?ఎలా కాపాడాడు..?అన్నదే ఏం మంత్రం వేసావె కథ.

ప్లస్ పాయింట్స్:

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ విజయ్ నటన. తన అద్భుత నటనతో ప్రేక్షకులను కట్టిపడేశాడు విజయ్ దేవరకొండ. అద్భుతమైన డైలాగ్‌లతో మెప్పించాడు. తొలిసినిమాతోనే ఆకట్టుకుంది శివానీ సింగ్‌. తన పాత్రకు వందశాతం న్యాయం చేసింది. ముఖ్యంగా విజయ్‌-శివానీ కెమిస్ట్రీ తెరపై అద్భుతంగా పండింది. మిగితా నటీనటులు తమ పరిధిమేరకు రాణించారు.

మైనస్ పాయింట్స్:

సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ కామెడీ లేకపోవడం,పేలవమైన స్క్రీన్ ప్లే. కొన్ని సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి. ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడతాయి.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమాకు మంచి మార్కులే పడతాయి. సమద్ అందించిన పాటలు,సంగీతం బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోరు పర్వాలేదనిపిస్తుంది. శివారెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. సహజమైన లొకేషన్స్‌తో కట్టిపడేశాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు:

అర్జున్‌ రెడ్డితో ప్రేక్షకులను మెప్పించిన విజయ్ దేవరకొండ తాజాగా ఏం మంత్రం వేసావె అంటూ ప్రేక్షకుల ముందుకువచ్చాడు. శ్రీదర్ మర్రి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు విజయ్ నటన ప్లస్ పాయింట్‌ కాగా కామెడీ లేకపోవడం,పేలవమైన స్క్రీన్ ప్లే మైనస్ పాయింట్స్. ఓవరాల్‌గా కొత్తకాన్సెప్ట్‌తో ఏం మంత్రం వేసావె అంటూ వచ్చిన విజయ్‌…ప్రేక్షకులను నిరుత్సాహ పర్చాడనే చెప్పాలి.

విడుదల తేది:09/03/2018
రేటింగ్:2/5
నటీనటులు:విజయ్ దేవరకొండ,శివానీ సింగ్
సంగీతం:సమద్
నిర్మాత:మల్కపురం శివ కుమార్
దర్శకత్వం:శ్రీదర్ మర్రి

- Advertisement -