వైసీపీ, టీడీపీలకు బి‌ఆర్‌ఎస్ సెగ!

23
- Advertisement -

గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయం హాట్ హాట్ చర్చలకు కారణం అవుతోంది. ముఖ్యంగా అధికార వైసీపీలో సొంత పార్టీ నేతల నుంచే తిరుగుబాటు చెలరేగడంతో ఆ పార్టీని ప్రధానంగా కలవర పెడుతున్న అంశం. నెల్లూరు కేంద్రంగా ఆనం నారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వంటి వాళ్ళతో పాటు మరికొంత మంది వైసీపీ నేతలు వైఎస్ జగన్ తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. ఇక ఇటీవల కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏకంగా ప్రభుత్వంపైనే ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేయడం ఎంతటి చర్చనీయాంశం అయిందో అందరం చూశాం.

దీంతో ఎన్నికల ముందు పార్టీలో అంతర్గత విభేదాలు తలనొప్పిగా మారే అవకాశం ఉంది. ఈ ఎన్నికలతో జగన్ 175 స్థానాల్లోనూ విజయం సాధించేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో ఎదురవుతున్న తిరుగుబాటు వైసీపీని కలవరపెడుతోంది. ఇక వైసీపీ ని విడేందుకు సిద్దంగా ఉన్న నేతలంతా ఇతర పార్టీలవైపు చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ అసంతృప్తి నేతలను టీడీపీలోకి ఆహ్వానించేందుకు తెలుగు తమ్ముళ్ళు గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కోటంరేడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ నుంచి బయటకు వచ్చినట్లు ప్రకటించారు. అయితే ఆయన టీడీపీలో చేరతారని ఆ మద్య వార్తలు గట్టిగా వినిపించాయి.

అయితే ప్రస్తుతం పోలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం ఆయన బి‌ఆర్‌ఎస్ గూటికి చేరేందుకు సిద్దమయ్యారట. ప్రస్తుతం బి‌ఆర్‌ఎస్ జాతీయ స్థాయిలో విస్తరిస్తూ వేగంగా ముందుకు కదులుతోంది. తెలంగాణ తరువాత ఏపీలో కూడా కే‌సి‌ఆర్ కు మంచి ప్రజామద్దతు ఉంది. దాంతో వచ్చే ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ పార్టీ.. ఏపీలోని ప్రధాన పార్టీలు అయిన వైసీపీ, టీడీపీ, జనసేన లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. దాంతో ఇతర పార్టీలలోని అసంతృప్తి నేతలంతా బి‌ఆర్‌ఎస్ వైపు చూస్తున్నాట్లు సమాచారం. ఒకవేళ నిజంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బి‌ఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకుంటే.. ఇంకా చాలమంది నేతలు ఇదే దారిలో వచ్చే అవకాశం ఉంది. నిజంగా ఇదే గనుక జరిగితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ లకు బి‌ఆర్‌ఎస్ సెగ గట్టిగా తాకే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి…

నిరంతర ప్రయత్నంతోనే సక్సెస్

రేవంత్ పాదయాత్ర.. కాంగ్రెస్ ను గట్టెక్కిస్తుందా?

భూకంప దృశ్యాలు కలిచివేశాయి: కేటీఆర్

- Advertisement -