వైసీపీలో వర్గ పోరు.. రోజాకు వ్యతిరేకంగా ఆందోళన..

30

నగరి నియోజకవర్గం వైఎస్సార్సీపీలో ఎమ్మెల్యే రోజాకు ఆమె వ్యతిరేక వర్గానికి మధ్య పోరు తారాస్థాయికి చేరుకుంది. రేపు సీఎం వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా పట్టణంలో రోజా వ్యతిరేక వర్గీయులు భారీగా బ్యానర్లు కట్టారు. అయితే వాటిలో రోజా ఫోటో లేకపోవడంతో రోజా వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ బ్యానర్లను చించివేశారు.. దీంతో వ్యతిరేక వర్గాలు రోడ్డుపైనే ఆందోళన నిర్వహించారు. వైఎస్సార్సీపీలో మాజీ మున్సిపల్ చైర్మన్ కేజీ కుమార్,రెడ్డి వారి చక్రపాణి రెడ్డి తదితరులు రోజాకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. ఆమె పార్టీలో తమను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ మధ్యనే జరిగిన ఎంపీపీ ఎన్నిక సందర్భంగా తమ ఎంపీటీసీల చేత రోజాకు వ్యతిరేకంగా ఓటు వేసేందుకు సిద్ధమయ్యారు అధిష్టానం జోక్యం చేసుకోవడంతో వెనక్కి తగ్గారు. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా రెండు వర్గాల మధ్య పోరు మరోసారి రోడ్డున పడింది.