మూడు భాషల్లో వైఎస్‌ యాత్ర

262
yatra
- Advertisement -

“నీళ్ళుంటే క‌రెంటు వుండ‌దు.. క‌రెంటు వుంటే నీళ్ళుండ‌వు..రెండూ వుండి పంట చేతికొస్తే స‌రైన ధ‌ర వుండ‌దు. అంద‌రూ రైతే రాజంటారు..స‌రైన కూడు గూడు గుడ్డ నీడ లేని ఈ రాచ‌రికం మాకొద్ద‌య్య‌..మ‌మ్మ‌ల్ని రాజులుగా కాదు క‌నీసం రైతులుగా బ్ర‌త‌క‌నివ్వండి చాలు..అని ప్ర‌తి రైతు గొంతెత్తి అరుస్తున్న స‌మ‌యం అది.. ఎవ‌రైనా ఆదుకుంటారా అని రైతన్న ఎదురుచూసిన
స‌మ‌యం లో ఒక గొంతుక వినిపించింది..” నేను విన్నాను నేను వున్నాను అంటూ ఓ పిలుపు పేద ప్ర‌జ‌ల‌వైవు నిలుచుంది. నాయ‌కుడిగా మ‌న‌కు ఏం కావాలో తెలుసుకున్నాము కాని జ‌నానికి ఏం కావాలో తెలుసుకొలేక‌పోయాము అంటూ అదిష్టానాన్ని సైతం లెక్క‌చేయ‌క పేద ప్ర‌జ‌ల క‌ష్టాల్ని విన‌టానికి క‌డ‌ప గ‌డ‌ప దాటి ప్ర‌జాయాత్ర ని పాద‌యాత్ర గా ప్రారంభించిన జ‌న‌నేత‌గా , మ‌హ‌నేత‌గా పేద ప్ర‌జ‌ల గుండె చ‌ప్పుడుగా ఎప్ప‌టికి ప‌దిల‌మైన చోటు సుస్థిర‌ప‌రుచుకున్న మ‌హ‌నాయికుడు దివంగ‌త నేత‌ ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ వై.య‌స్‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారు పాద‌యాత్ర‌లో ముఖ్య ఘ‌ట్టాల‌న్ని తీసుకుని రూపోందించిన చిత్రం యాత్ర.

వై ఎస్ ఆర్ రాజకీయ జీవితంలో పాదయాత్ర కీలక ఘట్టం.. ఆ సమయంలో జరిగిన ముఖ్య సంఘటనల సమాహారమే ఈ యాత్ర. మలయాళ సూప‌ర్‌స్టార్ మమ్ముట్టి వై ఎస్ ఆర్ పాత్రలో జీవిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజ‌ర్లు, ట్రైల‌ర్స్ కి చాలా మంచి స్పంద‌న రావ‌టంతో యూనిట్ అంతా ఆనందంగా వుంది. ఆనందొ బ్ర‌హ్మ లాంటి హిట్ చిత్రాన్ని అందించిన ద‌ర్శ‌కుడు మ‌హి వి రాఘ‌వ్ ఈ యాత్ర‌ ని తెర‌కెక్కించారు. భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్న 70 ఎం ఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అత్యంత భారీ వ్య‌యంతో, ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి శివ మేక సమర్పకుడు. ఆంధ్ర ప్ర‌దేశ్ ఎన్నికులు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ఫిబ్ర‌వరి 8న యాత్ర‌ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. అలానే తెలుగుతో పాటు త‌మిళం, మ‌ళ‌యాలంలో కూడా యాత్ర చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 8న రిలీజ్ చేస్తున్నారు. తెలుగు పార్ట్ కి సెన్సారు కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుంది. క్లీన్ యు స‌ర్టిఫికెట్ ని సొంతం చేసుకుంది.

ఈ సందర్భంగా నిర్మాతలు విజయ్ చిల్లా, శ.శి దేవిరెడ్డి మాట్లాడుతూ… మ‌డ‌మ‌తిప్ప‌ని నాయకుడు శ్రీ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డిగారి జీవితంలో అతి కీల‌క‌మైన పాద‌యాత్ర ఘ‌ట్టాన్ని మెయిన్ గా తీసుకుని యాత్ర చిత్రాన్ని నిర్మించాము. ఈ చిత్రం లో మ‌ళ‌యాల మెగాస్టార్‌ మ‌మ్ముటి గారు ప్ర‌‌జానాయ‌కుడు వై ఎస్ ఆర్ పాత్ర‌లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసి న‌టించార‌నేది ఇప్ప‌టికే ట్రైల‌ర్స్
చూసిన‌వారంద‌రికి తెలిస్తుంది. మా బ్యానర్ నుంచి భ‌లేమంచిరోజు, ఆనందోబ్ర‌హ్మ వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు యాత్ర హ్యాట్రిక్ చితంగా నిలుస్తుందనే నమ్మకంతో ఉన్నాం. ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించాం. ఈ చిత్రంలో ఆద్యంతం ఎమోషన్ తో కూడిన పాత్ర‌లు, పాత్ర చిత్రణ కనిపిస్తుంది. తెలుగు ప్ర‌జ‌లంద‌రూ త‌ప్ప‌కుండా చూడ‌వ‌ల‌సిన
చిత్రంగా తెర‌కెక్కిస్తున్నాం. దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి రాజకీయ ప్రయాణంలో ఆయన చేసిన పాదయాత్ర చరిత్రలో నిలిచిపోయింది. ఆయన పోరాట పటిమ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. అలాంటి రాజకీయ ప్రజ్ఞాశాలి పాదయాత్ర లో జరిగిన వాస్తవిక, భావోద్వేగ సంఘటనలతో ఈ యాత్ర చిత్రాన్ని నిర్మించాం. ప్ర‌తి తెలుగు వారు త‌ప్ప‌కుండా చూడాల్సిన చిత్రం. తెలుగు, త‌మిళ‌, మ‌ళ‌యాల భాష‌ల్లో ఏక‌కాలంలో యాత్ర చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 8 న విడుద‌ల చేస్తున్నాము..తెలుగు పార్ట్ కి సెన్సారు కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుంది. క్లీన్ యు స‌ర్టిఫికెట్ ని సొంతం చేసుకుంది. మంచి ఎమెష‌న‌ల్ చిత్రాన్ని నిర్మించినందుకు సెన్సెరు స‌భ్యులు మా యూనిట్ మెత్తాన్ని అభినందించారు.. వారికి మా ధ‌న్య‌వాదాలు.. రేపు ప్రేక్ష‌కులు కూడా ఇదే రెస్పాన్స్ ని అందిస్తార‌ని న‌మ్ముతున్నాము.. అని అన్నారు

నటీ నటులుఃమమ్ముట్టి, రావ్ రమేష్, జగపతిబాబు, సుహాసిని, అనసూయ, పోసాని, సచిన్ కడ్కర్, వినోద్ కుమార్, జీవా, 30 ఇయర్స్ పృథ్వి,సాంకేతిక వర్గంఃసినిమాటోగ్రాఫర్ – సత్యన్ సూర్యన్,మ్యూజిక్ – కె ( క్రిష్ణ కుమార్ ),ఎడిటర్ – శ్రీకర్ ప్రసాద్,సాహిత్యం – సిరివెన్నెల సీతారామ శాస్త్రి,ప్రొడక్షన్ డిజైన్ – రామకృష్ణ, మోనిక సబ్బాని,సౌండ్ డిజైన్ – సింక్ సౌండ్
వి ఎఫ్ ఎక్స్ – Knack Studios,పి ఆర్ ఓ – ఏలూరు శ్రీను,సమర్పణ – శివ మేక,బ్యానర్ – 70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్,నిర్మాతలు – విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ – మహి వి రాఘవ్

- Advertisement -