‘యాత్ర’.. టికెట్‌ ధర 4.37లక్షలు..!

241
- Advertisement -

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ‘యాత్ర’ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో మహి.వి.రాఘవ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 8న విడుదల కాబోతోంది. ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Yatra Movie70ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, నిర్వాణ సంస్థలు అమెరికాలో సీటెల్‌లో ‘యాత్ర’ ప్రీమియర్‌ షో మొదటి టికెట్‌ను వేలం వేశాయి. అందులో మునీశ్వర్‌ రెడ్డి 6,116 డాలర్లకు(దాదాపు 4.37లక్షలు) మొదటి టికెట్‌ను గెలుచుకున్నారు. అయితే $12 విలువ చేసే టికెట్‌ను అతనికి అందించి.. మిగతా డబ్బులను వైఎస్సార్‌ ఫౌండేషన్‌కు విరాళంగా ఇస్తామని తెలిపారు. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న వారందరికీ నిర్మాతలు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -