రాజశేఖర్ బర్త్ డే స్పెషల్..కల్కీ టీజర్‌

302
Kalki Teaser
- Advertisement -

పీఎస్‌వీ గరుడవేగ మూవీతో సెకండ్ ఇన్నింగ్స్‌లో అదరగొట్టిన యాంగ్రీ యంగ్ మ్యాన్‌ రాజశేఖర్ తాజాగా కల్కీగా ప్రేక్షకుల ముందుకురాబోతున్నాడు.‘అ!’ లాంటి వినూత్నమైన చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతుండగా రాజశేఖర్ బర్త్ డే సందర్భంగా టీజర్‌ని విడుదల చేశారు.

‘యాంగ్రీ యంగ్ మ్యాన్’ కాస్త ‘యాంగ్రీ స్టార్’గా ముందుకువస్తుండగా టీజర్ చూస్తుంటే సినిమా చాలా పవర్‌ఫుల్‌గా ఉండనున్నట్లు అర్థమవుతోంది. మరోసారి రాజశేఖర్‌లోని ఫైర్‌ను ప్రశాంత్ వర్మ తెరపై ఆవిష్కరించారినిపిస్తోంది. రాజశేఖర్ సరసన అదా శర్మ, నందితా శ్వేత, స్కార్లెట్‌ విల్సన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు.

ఈ సినిమా కోసం రూ. 2 కోట్లతో హైదరాబాద్‌లో ఒక భారీ సెట్‌ను నిర్మించారు. CK ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై C.కళ్యాణ్ , రాజశేఖర్ కూతుళ్ళు శివాని- శివాత్మిక హ్యాపీ మూవీస్ బ్యానర్‌తో ఈ సినిమా నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్నారు.

- Advertisement -