యాదాద్రి స్వర్ణతాపడం..విరాళాలు ఎవరు ఎంతంటే

36
gold

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం మార్చి 28,2022న పునప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వివరాలను సీఎం కేసీఆర్ వెల్లడించగా ఇక స్వామివారి విమానగోపురాన్ని స్వర్ణ తాపడం చేయనున్నట్లు ప్రకటించారు సీఎం. ఇందుకోసం 125 కిలోల బంగారం అవసరం అని రాష్ట్రంలోని ప్రతి గ్రామపంచాయతీని ఇందులో భాగస్వామ్యం చేస్తామని ప్రకటించారు.

ఇక తొలి విరాళం సీఎం కేసీఆర్ ప్రకటించారు. కిలో 16 తులాల బంగారం స్వామి వారికి అందిస్తుమని సీఎం ప్రకటించగా మంత్రి మల్లారెడ్డి కుటుంబం నుంచి కేజీ, మేడ్చల్ నియోజకవర్గం నుంచి కేజీ ప్రకటించారు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే జనార్ధన్ రెడ్డి రెండు కేజీల బంగారం, భాస్కర్ రావు కావేరి సీడ్స్ తరపున కేజీ బంగారం ఇస్తారని చెప్పారు. జీయర్ పీఠం నుంచి ఒక కేజీ బంగారం ప్రకటించగా హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మ‌న్ పార్థ‌సార‌ధి రెడ్డి 5 కిలోల బంగారం ఇచ్చేందుకు ముందుకు వ‌చ్చారు.

సీఎం కేసీఆర్ స్ఫూర్తితో యాదాద్రికి.. మేడ్చల్, రంగారెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల భారీ విరాళం ప్రకటించారు. విరాళం ప్రకటించిన వారిలో ఎంపీ రంజిత్ రెడ్డి , ఎమ్మెల్సీలు కె నవీన్ కుమార్, శంభిపూర్ రాజు, ఎమ్మెల్యేలు ఎ గాంధీ, ఎం హన్మంతరావు, ఎం కృష్ణా రావు, కేపీ వివేక్ ఆనంద్ ఉన్నారు. మొత్తం ఆరుగురు ఆరు కిలోల బంగారాన్ని ఆలయానికి అందించనున్నారు.