ఉప్పల్ టెస్ట్ ఓటమి..టీమిండియాకు పెద్ద షాక్

43
- Advertisement -

5 టెస్టుల సిరీస్‌లో భాగంగా ఉప్పల్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓటమి పాలైంది. స్వల్ప లక్ష్యాన్ని కూడా చేధించలేక చతికిలపడిపోయింది టీమిండియా. ఈ ఓటమితో టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. ప్ర‌పంచ టెస్టు చాంపియ‌న్‌సిప్ పాయింట్ల ప‌ట్టిక‌లో ఐదో స్థానానికి ప‌డిపోయింది.

గ‌త ఐదు టెస్టుల్లో కేవలం రెండు మాత్రమే గెలవడంతో బంగ్లాదేశ్‌ కంటే వెనుకబడిపోయింది. ఆస్ట్రేలియా టాప్ ర్యాంక్‌లో ఉండగా దక్షిణాఫ్రికా రెండో స్థానంలో, న్యూజిలాండ్ మూడో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ నాలుగో స్థానంలో ఉండగా తాజాగా ఉప్పల్ టెస్టులో ఓటమితో టీమిండియా ఐదో స్థానానికి పడిపోయింది. అయితే మిగ‌తా నాలుగు టెస్టుల్లో గెలిస్తే టీమిండియా టాప్‌లోకి దూసుకెళ్లే చాన్స్ ఉంది.

Also Read:నితీశ్‌..ఏం చేసినా ప్రత్యేకమే!

- Advertisement -