అధికార లాంఛనాలతో నర్సారెడ్డి అంత్యక్రియలు..

27
- Advertisement -

సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి నర్సారెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. నర్సారెడ్డి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. నర్సారెడ్డి నివాసానికి చేరుకుని ఆయన పార్ధివ దేహానికి నివాళి అర్పించారు రేవంత్.

నిర్మల్ జిల్లా మలక్ చించోలి గ్రామంలో జన్మించారు నర్సారెడ్డి. భారత స్వాతంత్ర్య ఉద్యమంలోనూ పని చేశారు. 1971 నుంచి 1972 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షులుగా పనిచేశారు. 1978లో జలగం వెంగళరావు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. 1967 నుంచి 1982 వరకు వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1991లో ఆదిలాబాద్ ఎంపీగా గెలిచారు. ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు.

Also Read:నితీశ్‌..ఏం చేసినా ప్రత్యేకమే!

- Advertisement -