WTC Final: భార‌త్‌పై న్యూజిలాండ్ ఘ‌న‌విజ‌యం

163
wtc final
- Advertisement -

ప్రపంచ టెస్ట్ చాంపియన్‌గా అవతరించింది న్యూజిలాండ్. సౌతాంప్టన్ వేదికగా భారత్‌తో జరిగిన ఫైనల్‌లో ఘన విజయం సాధించి తొలి టెస్టు ఛాంపియన్‌గా నిలిచింది కివీస్. భారత్ విధించిన 139 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు మాత్రమే కొల్పోయి చేధించింది. కెప్టెన్ విలియ‌మ్స్ 52 పరుగులు, రాస్ టేల‌ర్ 47 ప‌రుగులతో రాణించగా ఓపెన‌ర్లు టామ్ లాథ‌మ్ 9, దేవాన్ కాన్వె 19 ప‌రుగులు చేసి ఔట‌య్యారు.

అంతకముందు ఓవర్‌నైట్‌ స్కోరు 64/2తో బుధవారం ఆట కొనసాగించిన భారత్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే ఆలౌటైంది. రిషభ్‌ పంత్‌ (88 బంతుల్లో 41; 4 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలవగా, సౌతీ 4 వికెట్లతో దెబ్బ తీశాడు. మ్యాచ్‌లో 7 వికెట్లు తీసిన జేమీసన్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. విజేతగా నిలిచిన న్యూజిలాండ్‌కు 16 లక్షల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 11 కోట్ల 87 లక్షలు)తోపాటు గద (ట్రోఫీ) లభించింది. రన్నరప్‌ భారత జట్టుకు 8 లక్షల డాలర్లు (రూ. 5 కోట్ల 93 లక్షలు) ప్రైజ్‌మనీ దక్కింది.

- Advertisement -