రైటర్ పద్మ భూషణ్ @ 5 కోట్లు

6
- Advertisement -

ఈ వారం సందీప్ కిషన్ మైఖేల్ , సుహాస్ రైటర్ పద్మభూషణ్ సినిమాలతో పాటు బుట్ట బొమ్మ అనే రీమేక్ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే వీటిలో అంతో ఇంతో సందీప్ కిషన్ ‘మైఖేల్’ మీదే అంచనాలు ఏర్పడ్డాయి. కానీ టీజర్ , ట్రైలర్ చూసిన సినిమా కెళ్లిన ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది మైఖేల్. దీంతో మొదటి రోజే ఫ్లాప్ టాక్ అందుకుంది. ఇక మలయాళం కప్పేల కి రీమేక్ గా వచ్చిన ‘బుట్ట బొమ్మ’ కూడా పూర్తిగా మెప్పించలేకపోయింది. పైగా కొత్త వాళ్ళతో తీసిన సినిమా కావడంతో ప్రేక్షకులు ఈ సినిమా చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.

దీంతో రైటర్ పద్మభూషణ్ లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ముందే ప్రీమియర్స్ ద్వారా మంచి టాక్ తెచ్చుకోవడం , మొదటి రోజు సూపర్ టాక్ అందుకొని క్రిటిక్స్ ను సైతం మెప్పించడంతో సినిమా థియేటర్స్ లో బాగానే ఆడుతుంది. రెండు రోజులకే 3 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ చిన్న సినిమా ఇప్పుడు 5 గ్రాస్ కి చేరుకుంది. శనివారం , ఆదివారం మంచి వసూళ్లు రాబట్టాడు పద్మభూషణ్. సింపుల్ కథతో స్వీట్ అండ్ షార్ట్ గా షణ్ముఖ్ ప్రశాంత్ ఈ సినిమాను తెరకెక్కించి సక్సెస్ అందుకున్నాడు. రైటర్ అవ్వాలనుకునే కుర్రాడి ఆవేదనతో పాటు మహిళల టాలెంట్ కి కూడా పట్టం కట్టాలని చెప్పిన పాయింట్ అందరికీ నచ్చడం, పైగా ఫ్యామిలీ అంతా కలసి చూసే కంటెంట్ కావడంతో వీకెండ్ లో ఈ సినిమాను బాగానే చూశారు.

ఇక మైఖేల్ నిరాశ పరచడం కూడా ఈ చిన్న సినిమాకు ప్లస్ అయ్యింది. కలర్ ఫోటోతో ఓటీటీ లో సూపర్ హిట్ అందుకున్న సుహాస్ ఇప్పుడు రైటర్ పద్మభూషణ్ తో థియేటర్స్ లో కూడా సూపర్ హిట్ అందుకున్నాడు. మరి సుహాస్ ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో మరిన్ని సినిమాల్లో హీరోగా నటించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -