ఆమె వివాదమే కాదు, ప్రేరణ కూడా

46
- Advertisement -

కంగనా రనౌత్ అనగానే ఆమె వివాదాస్పద కామెంట్స్ గుర్తుకు వస్తాయి. అలాగే కంగనా రనౌత్ అనగానే అభిమానులు ఆమె అందం గురించే మాట్లాడుతారు. కానీ కంగనా తనువు మాత్రమే కాదు, మనసూ అందమైనదే! వివాదాస్పద కామెంట్లతో వార్తల్లో నిలిచినా.. వివక్ష, బెదిరింపులు ఎదుర్కొన్నా.. సమాజాన్ని ప్రేమించడంలో కంగనా రనౌత్ ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. ఈ తార గురించి ప్రపంచానికి తెలిసింది ఒకవైపే. కంగనా రనౌత్ లో మరో కోణమూ ఉంది.

ఔను, బాధ్యత తెలిసిన అందగత్తె కంగనా రనౌత్. చాలా స్వచ్ఛంద సంస్థల్లో కంగనా రనౌత్ కి సభ్యత్వం ఉంది. చారిటీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంది. సొంతంగానూ నిర్వహిస్తున్నది. సామాజిక సేవ చేస్తోంది. కంగనా రనౌత్ గురించి ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే.. ముంబైలోని ఒక మురికివాడలో 300 మంది పిల్లలు చదువుతున్న బడిని కంగనా రనౌత్ దత్తత తీసుకుంది. పిల్లలకు కావాల్సిన వస్తువులు, పుస్తకాలు, ఇతర నిత్యావసరాలు అన్నీ సమకూర్చింది.

ఎంత బిజీగా ఉన్నా తరచూ ఆ పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు అన్నీ అందుతున్నాయో లేదో కంగనా స్వయంగా గమనిస్తుంది. వాళ్ల యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటుంది. నిత్యం సినీ – రాజకీయ ప్రముఖుల పై నోరు పారేసుకున్నే కంగనా నేనా ఇలా చేస్తోంది ? అని ఆశ్చర్యపోతారు. కంగనా రనౌత్ అంత ప్రేమగా ఉంటుంది ఆ పిల్లలతో.

అన్నట్టు కంగనా రనౌత్ కోపిష్టి అనుకుంటారు. కానీ ఆమె సహనశీలి. తనపై ఎన్ని విమర్శలొచ్చినా.. వివాదాలు సృష్టించినా.. బెదిరింపు లేఖలు అందినా, ఫోన్లు చేసినా.. కంగనా రనౌత్ మాత్రం ధైర్యం కోల్పోలేదు. అన్నిటినీ ఓపికగా భరించింది. అన్ని రకాల పరిస్థితులనూ చూసింది. మానసిక బలం ఉంటే.. ఎలాంటి పరిస్థితుల్లో అయినా తట్టుకొని నిలబడొచ్చు అని నిరూపించింది. అందుకే కంగనా రనౌత్ అంటే ఒక్క వివాదామే కాదు, ప్రేరణ కూడా.

ఇవి కూడా చదవండి…

ఆ దర్శకుడితో చరణ్.. నిజమేనా ?

పఠాన్‌పై నిషేధం.. ప్రదర్శిస్తే మూడేళ్ల జైలు

అశోక్ గల్లా 2 గ్రాండ్ లాంఛ్‌

- Advertisement -