దాసరి నారాయణరావు రైటర్ నుండి డైరెక్టర్ అయ్యారు. జంధ్యాల, త్రివిక్రమ్, కొరటాల శివ, అనిల్ రావిపూడి మొదలగువారు రచయితల నుండి దర్శకులుగా మారి సక్సెస్ అయ్యారు. అదేబాటలో డైమండ్ రత్నబాబు కూడా రైటర్ నుండి దర్శకుడిగా మారబోతున్నారు. హీరో రామ్ నటించిన “దేవదాసు” చిత్రానికి ఘోస్ట్ రైటర్ గా వర్క్ చేసి సీమశాస్త్రి, పిల్లా నువ్వు లేని జీవితం, పాండవులు పాండవులు తుమ్మెద, సెల్ఫీ రాజా, ఈడోరకం ఆడోరకం, లేటెస్ట్‌గా మోహన్ బాబు ‘గాయత్రి’ సినిమాకు రచయితగా పనిచేసి తనదైన మార్క్ సంపాదించుకున్నాడు.
రచయితగా కెరీర్ కొనసాగిస్తున్న డైమాండ్ రత్నబాబు దర్శకుడిగా మారి ఆది సాయికుమార్‌కు కథ చెప్పడం సింగల్ సిట్టింగ్‌లో ఓకే అవ్వడం జరిగింది. కథ డిఫరెంట్ జానర్‌లో ఫుల్ లెన్త్ ఎంటర్టైనర్‌గా ఉండబోతోంది. దీపాల ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేయబడతాయి.