అఫ్గాన్‌పై భారత్‌ భారీ విజయం..

325
Ravindra Jadeja
- Advertisement -

ఎన్నో అంచనాలతో తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాలనుకున్న అఫ్గానిస్థాన్‌ కలలు ఒక్క రోజులోనే ఆవిరయ్యాయి. బెంగళూరులో ఆఫ్ఘనిస్థాన్ తో జరిగిన ఏకైక టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. కేవలం రెండు రోజుల్లోనే టెస్టును ముగించింది. ఇన్నింగ్స్ 262 పరుగుల భారీ ఆధిక్యంతో విజయదుందుభి మోగించింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ పసికూన ఆఫ్ఘాన్ పై టీమిండియా పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగించింది.

India

టాస్ గెలిచిన భారత కెప్టెన్ రహానే బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 474 పరుగులకు ఆలౌట్ అయింది. మురళీ విజయ్ (105), ధావన్ (107)లు శతకాలతో విరుచుకుపడ్డారు. కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యాలు అర్ధ సెంచరీలతో రాణించారు. ఐపీఎల్ లో అద్భుతంగా రాణించిన ఆఫ్ఘాన్ బౌలర్ రషీద్ ఖాన్ కేవలం రెండు వికెట్లు పడగొట్టి పర్వాలేదనిపించాడు.

తొలి ఇన్నింగ్స్‌లో 109పరుగులకే ఆలౌట్‌ అయిన ఆ జట్టు, ఫాలోఆన్‌లోనూ 38.4ఓవర్లలో 103పరుగులకే చాప చుట్టేసింది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో రవిచంద్రన్‌ అశ్విన్‌(4/27) అఫ్గాన్‌ నడ్డి విరవగా, ఫాలోఆన్‌లో రవీంద్ర జడేజా(4/17), ఉమేశ్‌ యాదవ్‌(3/26)తో కలిసి అఫ్గాన్‌ భరతం పట్టాడు. దీంతో 262తేడాతో భారత్‌ భారీ విజయాన్ని సాధించినట్లయింది.

- Advertisement -