వావ్.. పవన్ డేట్స్ ఇచ్చేశాడు

38
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ సినిమా మొత్తానికి సుఖాంతం అయింది. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ 1 నుంచి మొద‌లై 10 రోజుల పాటు జ‌ర‌గ‌నుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ డేట్స్ కూడా కేటాయించాడు. అలాగే మేలో కూడా పవన్ ఈ సినిమా కోసం 15 రోజుల పాటు డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీ లీల ఖ‌రారైన విష‌యం తెలిసిందే. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానుంది.

నిజానికి పవ‌న్ క‌ళ్యాణ్ కోసం కథ రాసిన సమయంలో దర్శకుడు హ‌రీష్ శంక‌ర్ మొదట అనుకున్న కథ ప్రకారం ఇద్దరు హీరోయిన్లను అనుకున్నారు. కానీ ఇప్పుడు ఒక్క హీరోయిన్ కే స్కోప్ ఉంది. ఆ హీరోయిన్ గా శ్రుతి హాసన్ నటించే అవకాశం ఉంది అంటూ ప్రచారం జరిగింది. చివరకు పవన్ సరసన శ్రీ లీల ఫైనల్ అయ్యింది. అయితే, శ్రీ లీల పవన్ సరసన ఎలా ఉంటుందో ? అంటూ ఫ్యాన్స్ లోనే భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. శ్రీ లీల వయసు చాలా తక్కువ.

అలాంటి ఆమె పవన్ పక్కన రొమాన్స్ చేస్తే.. బాగోదు. కాకపోతే, శ్రీలీల పాత్ర ఓన్లీ ప్లాష్ బ్యాక్ లో మాత్రమే వస్తోందట. కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు అని.. ఆ రోజుల్లో భార్య కంటే భర్త పదేళ్లు పెద్దవాడు అయ్యి ఉండేవాడు. మొత్తం మీద ఫ్రెష్ గా స్టార్ట్ కాబోతోంది పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్ సినిమా. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి…

పవన్ ఫ్యాన్ గా చిరు.. నిజమేనా?

అనుష్క కొత్త సినిమా టైటిల్ ఇదే!

గ్యాప్ లేకుండా వస్తున్న కుర్ర హీరో!

- Advertisement -