32 ఎకరాల విస్తీర్ణ భూభాగం. 369 అడుగుల ఎత్తు. అధునాతన హంగులు. ప్రపంచంలో అత్యంత్య ప్రతిష్టాత్మకంగా ముస్తాబైన శివుడి విగ్రహాన్ని సీఎం అశోక్ గహ్లోత్ ప్రారంభించారు. 9 రోజుల పాటు అక్టోబర్ 29 నుంచి నవంబర్ 6వ తేదీ వరకు వివిధ సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. విగ్రహాన్ని ‘విశ్వాస్ స్వరూపం’గా పేర్కొంటున్నారు. రాజస్థాన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిబడింది.
మహా శివుడి అతిపెద్ద విగ్రహాన్ని ఉదయ్‌పూర్‌కు 45 కిలోమీటర్ల దూరంలో తత్ పదమ్ సంస్థాన్ అనే సంస్థ నిర్మించింది. ఈ విగ్రహాన్ని నిర్మించేందుకు 10 ఏళ్ల సమయం పట్టింది. ఇందుకోసం 3,000 టన్నుల స్టీల్, ఐరన్ ఉపయోగంచారు. 2.5లక్షల క్యుబిక్ టన్నులు కాంక్రిట్, ఇసుకను వాడి పూర్తి రూపాన్నిచ్చారు. ప్రపంచంలోనే ఇది అతి ఎత్తైన శివుడి విగ్రహం. లోపలికి వెళ్లేందుకు వీలుగా లిఫ్టులు, మెట్లు, భక్తుల కోసం ప్రత్యేకంగా హాలు నిర్మించాం. ఇందులో నాలుగు లిఫ్టులు, మూడు మెట్ల మార్గాలు ఉన్నాయి.
World's tallest statue of shiva was inaugurated in rajsamand distict in Rajasthan pic.twitter.com/WDJgVlzXmE
— Priyadarshini soni (@PriyaSo62807043) October 29, 2022
ఇవి కూడా చదవండి