అండర్ 19 వరల్డ్ కప్ తుది అంకానికి చేరుకుంది. ఫైనల్లో భారత్‌తో తలపడే ప్రత్యర్ధి ఎవరో తేలిపోయింది. తొలి సెమీస్‌లో పాక్‌ను బంగ్లా చిత్తు చేయగా రెండో సెమీస్‌లో న్యూజిలాండ్‌ను బంగ్లాదేశ్ ఓడించి ప్రపంచకప్ సమరంతో తొలిసారి ఫైనల్‌కు చేరుకుంది.
గురువారం జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్లతో కివీస్‌పై నెగ్గిన బంగ్లా ఆదివారం జరుగనున్న తుదిపోరులో భారత్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 211 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన బంగ్లా మహ్మూదుల్ ఇస్లాం శతకంతో విజృంభించడంతో 44.1 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 215 పరుగులు చేసింది. తౌహిద్ (40), షహాదత్ హుసేన్ (40 నాటౌట్) రాణించారు.
భారత్ వరుసగా మూడోసారి ఫైనల్లో అడుగుపెట్టగా బంగ్లా తొలిసారి ఫైనల్‌కు చేరుకుంది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన బంగ్లా కెప్టెన్ అక్బర్ అలీ..భారత్ మెరుగైన ప్రత్యర్థే అయినా.. తాము ఏ మాత్రం ఆందోళనకు గురికాకుండా ముందడుగేస్తాం అన్నారు.