టాక్సీవాలా దర్శకుడితో నాని..!

438
nani
- Advertisement -

వరుస సినిమాలతో 2020లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం వి,టక్ జగదీష్ సినిమాలతో ముందుకు వచ్చేందుకు సిద్ధమైన నాని తాజాగా మరో సినిమాకు కమిట్ అయ్యాడు. టాక్సీవాలా ఫేం రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నాని సరసన సాయి పల్లవి మరోసారి జోడి కట్టనుండగా ఈ సినిమా షూటింగ్ మే నుండి ప్రారంభం కానుంది. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌ నిర్మాణంలో తెరకెక్కనుంది.

ఇక ప్రస్తుతం నాని ..ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘వి’ సినిమాలో నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో సుధీర్ బాబు కీలకపాత్రలో నటిస్తుండగా నివేదా థామస్, అదితీరావు హైదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇక వీతో పాటు శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీశ్ మూవీ కూడా చేస్తున్నాడు నాని. ఇటీవలె విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మొత్తంగా ఈ ఏడాది వరుస సినిమాలతో బాక్సాఫీస్‌ని షేక్ చేసేందుకు సిద్ధమయ్యాడు నాని.

- Advertisement -