జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ మెట్రో..నేడు ప్రారంభం

405
cm kcr
- Advertisement -

హైదరాబాద్‌ మెట్రోరైలు కారిడార్‌ -2 పూర్తిస్ధాయిలో అందుబాటులోకి రానుంది. ఇవాళ జేబీఎస్ -ఎంజీబీఎస్ మార్గాన్ని ఇవాళ సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. మొత్తం 11 కిలోమీటర్లున్న ఈ మార్గం అందుబాటులోకి రానుండటంతో నగరంలో ఏ మూల నుంచైనా ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. మంత్రులు కేటీఆర్,తలసాని,మల్లారెడ్డి,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి మెట్రోరైలులో ఎంజీబీఎస్‌వరకు సీఎం కేసీఆర్‌ ప్రయాణించనున్నారు.

జూబ్లీబస్‌స్టేషన్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు తొమ్మిది స్టేషన్లు అందుబాటులో ఉండనున్నాయి. జేబీఎస్‌, సికింద్రాబాద్‌ వెస్ట్‌, గాంధీ దవాఖాన, ముషీరాబాద్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్‌బజార్‌, ఎంజీబీఎస్‌ స్టేషన్లు ఉన్నాయి. రోడ్డు మార్గం ద్వారా అనేక అవాంతరాలతో ప్రయాణిస్తే గంటా 10 నిమిషాలు సమయం పడుతుంది. అదే మెట్రోరైలులో ప్రయాణిస్తే 11 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 16 నిమిషాల్లో చేరుకోవచ్చు.

మెట్రో ప్రారంభోత్సవం సందర్భంగా జేబీఎస్‌కు తరలివచ్చే ప్రజలు, పార్టీ శ్రేణులను ఉద్దేశించి సీఎం మాట్లాడనున్నారు. ఈ కారిడార్‌-2లో రెండు ప్రత్యేకతలున్నాయి. ఒకటి ఐదంతస్తులతో మెట్రో ప్రాజెక్టులోనే అత్యంత ఎత్తైన మెట్రోస్టేషన్‌గా జేబీఎస్‌ ఉండగా, దేశంలోనే అతిపెద్ద మెట్రో ఇంటర్‌చేంజ్‌ స్టేషన్‌గా ఎంజీబీఎస్‌ ఉన్నది. పీపీపీ విధానంలో ప్రపంచంలో 200 మెట్రోరైలు ప్రాజెక్టులు నిర్మించగా, ఇందులో ఏడు మాత్రమే విజయ వంతమయ్యాయి. వీటిలో హైదరాబాద్‌ మెట్రోరైలు ఉండటం విశేషం.

- Advertisement -