కరోనా….అప్ డేట్స్

153
corona in ts

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 14,91,785గా నమోదైంది. కరోనా మరణాల సంఖ్య 87,458కు చేరగా అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 4,18,410గా నమోదైంది. ఇప్పటివరకు అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 14,240కు చేరింది.

దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,908గా నమోదైంది. దేశవ్యాప్తంగా కరోనాతో 183 మంది మృతి చెందారు.507 మంది కరోనా బాధితులు కోలుకున్నారు.

రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 453కి చేరింది. ఇప్పటివరకు 11 మంది కరోనా బాధితులు మృతి చెందగా, పూర్తిగా కోలుకొని 45 డిశ్చార్జి అయ్యారు. ఇవాళ ఇళ్లలో ఉండి క్వారంటైన్‌ పూర్తయన 25,000 మందికి విముక్తి లభించనుంది.

ఇక ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 348కి చేరింది. ఇప్పటివరకు 9 మంది కోలుకున్నారు. విశాఖలో ముగ్గురు డిశ్చార్జ్‌ అయ్యారు.