రెండు రోజులు భారీ వర్షాలు…

87
rains

ఉపరితల ద్రోణి ప్రభావంతో రెండు రోజు గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గ్రేటర్‌లో బుధవారం 38 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత, 24.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత, గాలిలో తేమ 24.1 శాతంగా నమోదైందని పేర్కొన్నారు.

ఉపరితల ఆవర్తనాలకుతోడు అధిక ఉష్ణోగ్రతల కారణంగా క్యుములోనింబస్‌ మేఘాలు ఏర్పడటంతో గురు, శుక్రవారాల్లో గ్రేటర్‌లోని పలుచో ట్ల ఓ మోస్తరు నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని చెప్పారు.