తెలంగాణ పోలీసులకు నా సెల్యూట్..

359
naga chaitanya
- Advertisement -

తెలంగాణలో కరోనా కట్టడిలో అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు పోలీసులు. తొలుత పోలీసుల తీరుపై విమర్శలు వచ్చినా తర్వాత వారి విధి నిర్వహణలో భాగమేనని అర్దం చేసుకున్న ప్రజలు ప్రశంసలు గుప్పిస్తున్నారు.

తాజాగా అక్కినేని నాగచైతన్య పోలీసుల సేవలను కొనియాడారు. ప్రాణాలు పణంగా పెట్టి మన కోసం సేవలు చేస్తున్న వారికీ నాగచైతన్య ధన్యవాదాలు తెలిపారు.

కరోనా వైరస్ ప్రభావాన్ని నివారించడంలో భాగంగా గత రెండు, మూడు వారాల్లో మన ప్రభుత్వం పలు కఠిన నిర్ణయాలను తీసుకుంటోంది. చాలా త్వరగా చర్యలు చేపట్టడం వల్ల ఈ వైరస్ ఎక్కువగా ప్రబలలేదని వీడియోలో పేర్కొన్నారు చైతూ.

అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చినప్పుడు తెలంగాణ పోలీసులు ప్రజల రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను గమనించాను. ప్రజల సంక్షేమం కోసం పోలీసులు వారి ప్రాణాలను, వారి కుటుంబ సభ్యుల ప్రాణాలను రిస్క్‌లో పెడుతున్నారు. వారందరికీ సెల్యూట్ అని పేర్కొన్నారు.

- Advertisement -