ఏలూరులో ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం

165
yeluru
- Advertisement -

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ప్రజలు అంతుచిక్కని వ్యాధితో అల్లాడపోతున్నారు. మినరల్‌ వాటర్, కాచి చల్లార్చిన నీటిని తీసుకున్న వారూ అనారోగ్యం బారిన పడ్డారు. అంతుబట్టని వ్యాధికి కారణాలను అన్వేషించేందుకు అత్యున్నత స్థాయి వైద్య నిపుణుల బృందాలను ఏపీ ప్రభుత్వం భాగస్వాములను చేసింది.

ఓ వైపు యుద్ధ ప్రాతిపదికన వైద్యసేవలు అందిస్తూనే మరోవైపు నిపుణుల బృందాలను రాష్ట్రానికి రప్పిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన వైద్య బృందం ఇప్పటికే నగరానికి చేరుకోగా కేంద్ర బృందాలను సైతం వెంటనే పంపాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.

న్యూరో టాక్సిన్స్ ప్రభావం మెదడుకు సోకి ఇలా జరుగుతుండవచ్చనే కోణంలో పరిశీలన జరుగుతోంది. మూర్ఛ, వాంతుల లక్షణాలతో వస్తున్న బాధితుల నుంచి నమూనాలు సేకరించి ఇప్పటికే వివిధ పరీక్షలు నిర్వహించినా వ్యాధికి సంబంధించి ఎలాంటి ఆధారాలూ లభించలేదు. గత వారం రోజులుగా బాధితులు ఎలాంటి ఆహారం తీసుకున్నారు? ఏ కూరగాయలు తిన్నారు? అనే వివరాలను సేకరిస్తున్నారు.

ఏలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరిశీలించిన అనంతరం ఎట్టి పరిస్థితుల్లో ఇది ఇన్ఫెక్షన్‌ (ఒకరి నుంచి ఒకరికి వచ్చే జబ్బు) కాదని నిర్ధారించారు. ఇప్పటివరకు 22 నీటి నమూనాలు సేకరించగా అన్నీ నార్మల్‌గానే ఉన్నాయి. సీటీ స్కాన్‌ 45 మందికి నిర్వహించగా అందరికీ నార్మల్‌గా ఉన్నట్లు తేలింది.

- Advertisement -