‘వరల్డ్ ఫేమస్ లవర్’ ట్విట్టర్ రివ్యూ..

854
Vijay Devarakonda

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఫిబ్రవరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కె.ఎస్. రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె.ఎ. వల్లభ నిర్మించారు. ఈ మూవీలో రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, క్యాథరిన్ ట్రెసా, ఇజాబెల్లే లెయితే హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ప్రీమియర్ షోలు ఇప్పటికే ఓవర్సీస్‌లో మొదలయ్యాయి. మరీ ఈ సినిమాను అక్కడ చూసిన సినీ ప్రేక్షకులు సినిమా గురించి ఏమంటున్నారో చూద్దాం..

విజయ్ దేవరకొండ ఇక తన స్టైల్లో ఇటూ యాక్టింగ్‌లోను అటూ విడుదలకు ముందు నిర్వహించిన ప్రచారం కూడా సినిమాపై విపరీతమైన బజ్‌ను క్రియేట్ చేసింది. ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే కానుకగా భారీ అంచనాల మధ్య ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కాగా యూఎస్‌లో ఈ సినిమా ప్రిమియర్ చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. మరీ ఈ సినిమా విజయ్‌కు మరో బ్లాక్ బస్టర్ కానుందా.. లేదా యావరేజ్ ఫిల్మ్‌గా నిలవనుందా.. చూసిన వాళ్లు ఏమంటున్నారో చూద్దాం..

World-Famous-Lover

ఈ సినిమా గురించి కొంతమంది ఫస్టాఫ్ అదిరిపోయిందని అంటుంటే.. పర్వాలేదని కొందరు అంటున్నారు. ఎప్పటిలాగే విజయ్ దేవరకొండ తన నటనతో కట్టిపడేశారట. విజయ్‌కు తోడుగా రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్ అద్భుతంగా చేశారని అంటున్నారు. విజయ్ నటించిన కార్మికుడి పాత్ర మెయిన్ హైలైట్‌గా నిలుస్తుంది. అంతేకాక సువర్ణ-శీనయ్యల ఎపిసోడ్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఫస్ట్ హాఫ్‌ మొత్తం ఎంటర్టైనింగ్‌గా సాగితే.. సెకండ్ హాఫ్ అక్కడక్కడా బోర్ అనిపిస్తుంది. ఇక బబ్లీ బ్యూటీ రాశి ఖన్నా మొదటిసారి తన కెరీర్‌లో ఈ సినిమాలోని తన పాత్రతో పెద్ద సాహసం చేసిందని చెప్పాలి. మరోవైపు ఇజాబెల్లే, క్యాథరిన్‌లు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

ఇక దర్శకుడు క్రాంతి మాధవ్.. ఈ సినిమాను కాస్త డిఫరెంట్‌గా టేకప్ చేశారని అంటున్నారు. ట్రెండ్‌కు తగ్గట్టుగా విజయ్‌తో ప్యూర్ లవ్ స్టోరీని తెరకెక్కించారు. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ టైటిల్‌కు యాప్ట్ అయ్యే విధంగా తనదైన మార్క్‌లో నాలుగు ప్రేమ కథలను దర్శకుడు అద్భుతంగా చూపించారు. అటు విజయ్ దేవరకొండ కూడా నాలుగు డిఫరెంట్ షేడ్స్‌లో మరోసారి తన వైవిధ్యమైన నటనతో అందర్నీ ఆకట్టుకున్నారు. మొత్తంగా వరల్డ్ ఫేమస్ లవర్‌తో దేవరకొండ మరో హిట్ అందుకున్నాడనే తెలుస్తోంది.