శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం…

620
Maha Shivaratri Brahmotsavam
- Advertisement -

మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం క్షేత్రంలో ఈనెల బ్రహ్మోత్సవాలు ప్రారంభమైయ్యాయి. ఈ సందర్భంగా శ్రీశైలం క్షేత్రంలో భక్తుల సౌకర్యార్ధం అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆలయ కార్యనిర్వాహణాధికారి రామారావు తెలిపారు. ఇక 14వ తేదీ నుంచి 24 వరకు జరిగే ఈ ఉత్సవాలకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మల్లిఖార్జున స్వామిని దర్శంచుకుంటారని ఆయన పేర్కొన్నారు.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ దర్శన వేళల్లో మార్పులు, ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్టు తెలిపారు. భక్తుల రాకపోకలకు వీలుగా 18 నుంచి 22వ తేదీ వరకు మన్ననూర్‌ అటవీ ప్రాంతంలో రాత్రి వేళలో రాకపోకలకు ఉన్న ఆంక్షలు తొలగించనున్నట్టు చెప్పారు.

- Advertisement -