రానా ‘అరణ్య’ టీజ‌ర్‌కు అద్భుత స్పందన..

544
Rana copy
- Advertisement -

టాలీవుడ్‌ హీరో రానా దగ్గుబాటి ప్రస్తుతం ‘అరణ్య’ త్రిభాషా చిత్రంలో న‌టిస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ ఈ మూవీని నిర్మిస్తోంది. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో తెకెక్కుతోంది. హిందీలో ‘హథీ మేరే సాథి’, తమిళంలో ‘కాండన్’, తెలుగులో అరణ్య టైటిల్స్‌తో తెరకెక్కిస్తున్నారు. ప్రభు సాల్మన్‌ దర్శకుడు. ఇటీవలే ‘అరణ్య’ ఫస్ట్ లుక్, టీజర్ ను విడుదల చేశారు. ఇందులో రానా లుక్ చాలా డిఫ‌రెంట్‌గా ఉంది. మావటివాడి పాత్ర‌లో ఆయ‌న క‌నిపించ‌నున్నారు.

ఈచిత్ర టీజ‌ర్ లో స‌న్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. రానా పాత్ర భారత సినీ చరిత్రలో నిలిచిపోయేలా క‌నిపిస్తుంది. చిత్రంలో తమిళ నటుడు విష్ణు విశాల్, ప్రభు సాల్మోన్, శ్రియ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. తాజాగా విడుద‌లైన టీజ‌ర్‌కి సూప‌ర్భ్ రెస్పాన్స్ వ‌స్తుంది.

ప్రాణ స్టూడియో ఈ సినిమాకు వి.ఎఫ్‌.ఎక్స్‌ చేస్తుండగా.. శాంతను మోయిత్ర ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఆస్కార్‌ అవార్డ్‌ విజేత రసూల్‌ పూకుట్టి ఈ చిత్రానికి సౌండ్‌ డిజైనింగ్‌ చేస్తున్నారు. ఏప్రిల్ 2న చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు.

- Advertisement -