వన్డే వరల్డ్ కప్ హిస్టరీ లో అత్యధికంగా ఐదు సార్లు కప్పు సాధించిన విశ్వవిజేతగా తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తూ వచ్చిన ఆస్ట్రేలియా జట్టు ఈసారి వరల్డ్ కప్ లో మాత్రం ఎవరు ఊహించని విధంగా డీలా పడిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ ప్రత్యర్థులకు చెమటలు పట్టించే కంగారులు.. మొదటి రెండు మ్యాచ్ లను ఓడిపోయి పాయింట్ల పట్టికలో కింది నుంచి రెండో స్థానానికి దిగజారిపోయింది. దీంతో ఈసారి ఆసీస్ జట్టు లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టనుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే కంగారులను ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకూడదని మరోసారి రుజువైంది. .
శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించి మొదటి విజయాన్ని ఖాతాలో వేసుకున్న ఆసీస్ జట్టు ఇక తాజాగా పాక్ తో జరిగిన మ్యాచ్ లో కూడా విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఏకంగా నాలుగో స్థానానికి చేరుకుంది. పాక్ తో జరిగిన నిన్నటి మ్యాచ్ లో నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 367 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇందులో డేవిడ్ వార్నర్ 163 పరుగులు, మిచెల్ మార్ష్ 121 పరుగులు చేసి.. సెంచరీలతో కథం తొక్కారు. ఇక ఆ తరువాత బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ 305 పరుగులు చేసి ఆలౌట్ గా నిలిఃచింది, దీంతో ఆస్ట్రేలియా జట్టు 62 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. పాక్ బ్యాటర్స్ లలో అబ్దుల్ల 64 పరుగులు, ఇమామ్ 70 పరుగులు, రిజ్వాన్ 46 పరుగులతో రాణించినప్పటికి ఫలితం లేకపోయింది. దీంతో పాకిస్తాన్ మరో ఓటమిని చవిచూడక తప్పలేదు. మొత్తానికి ఆస్ట్రేలియా జట్టు తిరిగి పుంజుకోవడం ప్రత్యర్థి జట్లను కంగారు పెట్టే అంశమే.
Also Read:కవితక్కకు ఈ విజయం అంకితం:జగన్‌మోహన్‌రావు