Bigg Boss 7 Telugu:ఈ వారం శివాజీ ఎలిమినేషన్ పక్కా!

29
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ 47 రోజులు పూర్తి చేసుకుంది. గత రెండు మూడు వారాలుగా శివాజీ చేతి గాయంతో బాధపడుతున్నారు. అయితే గాయం ముదిరిపోవడంతో.. ఆయన్ని బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ చేయబోతున్నారు. గతవారం చేతిగాయం మరింత ముదరడంతో ఆయన్ని హౌస్ నుంచి బయటకు పంపించారు. స్కానింగ్ అనంతరం తిరిగి మళ్లీ హౌస్‌లోకి పంపించారు. ఈవారం టాస్క్‌లో కూడా కేవలం శివాజీని సంచాలక్‌గా పరిమితం చేశారు.

ఎవరూ లేకపోతే నేనే ఏడుస్తున్నా.. ఎవరైనా ఉంటే నవ్వుతూనే బాధను భరిస్తున్నా.. లోపల ఏడుస్తున్నా. అందరి ముందు ఏడ్వలేకపోతున్నాను.. బరువుగా ఉంది. నన్ను హౌస్‌లో ఉన్న వాళ్లు.. ఆడటం లేదు అని అనేసరికి బాధగా ఉంది అంటూ ఏడ్చేశాడు శివాజీ. దీంతో శివాజీని హౌస్ నుంచి బయటకు పంపడం కన్ఫార్మ్ అయ్యినట్టు తెలుస్తోంది.

ఇక జిలేబీపురం వర్సెస్ గులాబీపురం ఇంటి సభ్యుల మధ్య ఈవారం జరిగిన టాస్క్‌లలో జిలేబీపురం గెలవడంతో.. వాళ్లకి ఈవారం కెప్టెన్స్ అయ్యే పోటీదారులుగా అవకాశం ఇచ్చారు బిగ్ బాస్. రెండు ఊర్లకి పెద్దగా ఉన్న శివాజీకి నేరుగా కెప్టెన్ అయ్యే బంపర్ ఆఫర్ ఇచ్చాడు.

Also Read:World Cup 2023:ఆసీస్ ఊపిరి పిల్చుకున్నట్లే!

- Advertisement -