Worldcup Tickets:తేదీలు ఖరారు

36
- Advertisement -

వరల్డ్ కప్ 2023 త్వరలో ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మ్యాచ్‌లకు సంబంధించి తేదీలు,వేదిక ఖరారు కాగా తాజాగా ఈ మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్స్ ఏ ఏ రోజున విడుదల చేయనున్నామో ప్రకటించింది ఐసీసీ.

ఆగస్టు 25న నాన్ ఇండియా వార్మప్ మ్యాచ్‌లు, నాన్ ఇండియా మ్యాచ్‌లకు సంబంధించి టికెట్లు విక్రయాలు ప్రారంభంకానున్నాయి. భారత్ మినహా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, నెదర్లాండ్స్ (తొమ్మిది జట్లు) మ్యాచ్‌ల టికెట్లు విక్రయాలు జరగనున్నాయి.

భారత్ ఆడే వార్మప్ మ్యాచ్‌లు, వరల్డ్ కప్ మ్యాచ్‌లకు సంబంధించి ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు విక్రయాలు జరుగుతాయి. సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లను సెప్టెంబర్ 15 నుంచి విక్రయాలు చేయనున్నారు.

Also Read:బీరకాయ తింటే ఆ సమస్యలు దూరం!

ఆగస్టు 30న గౌహతి, త్రివేండ్రంలో భారత్ వార్మప్ మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లు విక్రయాలు ప్రారంభమవుతాయి. ఆగస్టు 31: చెన్నై (ఆస్ట్రేలియా – ఇండియా), ఢిల్లీ (ఆఫ్ఘనిస్థాన్ – ఇండియా), పూణె ( బంగ్లాదేశ్ – ఇండియా) మ్యాచ్‌లకు సంబంధించి టికెట్ల విక్రయం ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 1 : ధర్మశాల (న్యూజిలాండ్ – ఇండియా), లక్నో (ఇంగ్లండ్ – ఇండియా), ముంబై (శ్రీలంక – ఇండియా) మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లు విక్రయం ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 3 : అహ్మదాబాద్‌లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు విక్రయాలు జరగనున్నాయి. సెప్టెంబర్ 15: సెమీ ఫైనల్స్ (ముంబై, కోల్‌కతాలో), ఫైనల్ (అహ్మదాబాద్) జరిగే మ్యాచ్ ల టికెట్ల విక్రయాలు జరగనున్నాయి.

Also Read:షర్మిల కండిషన్స్.. పాలేరు కోసమే?

- Advertisement -