టీమిండియాకు సెమీస్ గండం!

29
- Advertisement -

వరల్డ్ కప్ లో వరుస విజయాలు సాధించిన టీమిండియా ఆడిన ప్రతి మ్యాచ్ లోనూ అద్భుతమైన ప్రదర్శన కనబరిచి సంచలన విజయాలను నమోదు చేసింది. ప్రస్తుతం సెమీస్ లోనూ హాట్ ఫేవరెట్ గా రోహిత్ సేన.. ఐసీసీ నిబంధనల ప్రకారం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టు సెమీస్ చేరిన నాలుగో జట్టుతో తలపడాల్సిఉంది. దీంతో సెమీస్ కు చేరిన నాలుగో జట్టుగా న్యూజిలాండ్ ఉంది. దాంతో ఈ నెల 15 న జరిగే సెమీస్ ఫైట్ లో రోహిత్ సేన కివీస్ జట్టును ఢీ కొననుంది. 2019 వరల్డ్ కప్ లో సెమీస్ లో కివీస్ చేతిలోనే ఓటమిపాలు అయి టోర్నీ నుంచి నిష్క్రమించింది టీమిండియా. దాంతో ఈసారి ఎలాగైనా న్యూజిలాండ్ పై ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ భావిస్తోంది..

ఇప్పటివరకు సెమీస్ లో భారత్ రికార్డులను పరిశీలిస్తే.. చెప్పుకోదగ్గ స్థాయిలో అనుకూలంగా లేవు. 1987,1996, 2015, 2019 సంవత్సరాలలో సెమీస్ లో అపజయాలను చవిచూసింది టీమిండియా. పైగా ఈసారి సెమీస్ పోరు జరుగుతున్నా వాఖండే స్టేడియంలో టీమిండియా రికార్డులు ఏమంత అనుకూలంగా లేవు. 2016 టి 20 వరల్డ్ కప్ సెమీస్ లోనూ, అలాగే 1987 లో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన సెమీస్ లోనూ ఇదే స్టేడియంలో ఓటమిని మూటగట్టుకుంది రోహిత్ సేన.. దాంతో ఈ సెమీస్ కూడా అదే వంఖాండే స్టేడియంలోనే జరుగుతుండడంతో అభిమానులు కొంత కలవరానికి లోనౌతున్నారు. అయితే పస్తుతం టీమిండియా అన్నీ విభాగాల్లోనూ అద్బుతంగా రాణిస్తుంది. దాంతో ఇదే ఫామ్ ను సెమీస్ లో కూడా కొనసాగిస్తే కివీస్ ను మట్టికరిపించడం పెద్ద విషయమేమి కాదని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read:Bigg Boss 7 Telugu: చుక్కలు చూపించిన రతిక

- Advertisement -