కివీస్ హ్యాట్రిక్ ఓటమి..

18
- Advertisement -

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికా సెమీస్‌లోకి అడుగు పెట్టింది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 190 పరుగుల తేడాతో విజయం సాధించగా న్యూజిలాండ్ హ్యాట్రిక్ పరాజయాన్ని మూటగట్టుకుంది.దక్షిణాఫ్రికా విధించిన 358 పరుగుల భారీ లక్ష్య చేధనలో కేవలం 167 పరుగులకే ఆలౌట్ అయింది.

గ్లెన్ ఫిలిప్స్ ఒక్కడే 50 బంతుల్లో 60 పరుగులు చేసి రాణించగా మిగితా ఆటగాళ్లంత విఫలమయ్యారు. కాన్వేను(2) ,విల్‌ యంగ్ (33), రచిన్ రవీంద్ర (9),డారిల్ మిచెల్ 24 పరుగులు చేశారు. కేశవ్ మహారాజ్ 4 ,జాన్సెన్ 3 వికెట్లతో చెలరేగారు.

ఇక అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 357 పరుగులు చేసింది. కెప్టెన్ బవుమా 24 పరుగులు చేయగా డికాక్ (114), వాన్‌డర్ డసెన్ (133) సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు ఏకంగా 200 పరుగులు జోడించారు. తర్వాత వచ్చిన మిల్లర్ సిక్సర్లు, ఫోర్లతో విరుచుకపడ్డాడు. కేవలం 30 బంతుల్లో 50 పరుగులు చేయడంతో దక్షిణాఫ్రికా భారీ స్కోరు సాధించగలిగింది.

Also Read:KTR:కేసీఆరే మళ్లీ సీఎం

- Advertisement -