Bigg Boss 7 Telugu:ప్రశాంత్‌కి ధైర్యం చెప్పిన శివాజీ

46
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 7 తెలుగు విజయవంతంగా 59 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా కంటెస్టెంట్లను మళ్లీ రెండు టీంలుగా విడగొట్టారు బిగ్ బాస్. ఒక టీమ్‌ వీర సింహాలుకాగా మరో టీమ్‌కి గర్జించే పులులు అని పేరు పెట్టాడు. వీర సింహాలు టీమ్‌లో యావర్, గౌతమ్, భోలే, తేజ, శోభా, రతిక ఉండగా అర్జున్, ప్రశాంత్, శివాజీ, అమర్, ప్రియాంక, అశ్విని గర్జించే పులుల టీమ్‌లో ఉన్నారు.

తొలుత ఈ రెండ్ టీమ్‌లకు హాల్ ఆఫ్ బాల్ అంటూ టాస్క్ ఇచ్చారు. ఈ గేమ్‌లో సభ్యులు టీమ్‌గా ఆడుతూ వారి బలాలను ఉపయోగించాలి. ఆపోనెంట్స్ కంటే ఎక్కువ బంతులను సేకరించాలి. గార్డెన్ ఏరియాలో ఉంచిన పైపు నుంచి బజర్ మోగిన వెంటనే చిన్న చిన్న బాల్స్ పడుతుంటాయి. వీటి ని కంటెస్టెంట్లు వాళ్లకి ఇచ్చిన సంచులలో పట్టుకోవాలి. ఏ టీమ్ ఎక్కువ బంతులను సేకరిస్తుందో వాళ్లు విన్నర్. అయితే ఈ బంతులను కేవలం వారికి ఇచ్చిన సంచులలో మాత్రమే దాయాలి. బట్టల్లో, సూట్‌కేసుల్లో, బ్యాగుల్లో ఇలా ఎక్కడా ఉంచకూడదు అని చెప్పారు.

ఇక బజర్ మోగిన వెంటనే అర్జున్ అందరికంటే హైట్ ఉండటంతో వెళ్లి పైపు కింద సంచి పెట్టి తెగ పట్టేశాడు. దీంతో గౌతమ్ వెనక నుంచి ఆ సంచి లాగేయడంతో బాల్స్ అన్నీ కింద పడిపోయాయ్. దీంతో మిగిలినవాళ్లు ఏరేసుకున్నారు. తర్వాత బిగ్‌బాస్ మధ్యలో ఛాలెంజ్ పెట్టాడు. పవర్ బాక్స్ ఛాలెంజ్ అంటూ పెట్టిన ఈ టాస్కు ప్రతి గేమ్ తర్వాత వస్తుందని ప్రకటించాడు. జంపింగ్ జపాంగ్ అంటూ ఓ గేమ్ పెట్టాడు. దీని ప్రకారం వీలైనన్ని ఎక్కువ బెలూన్లను టైర్ల మధ్యలో ఫిట్ చేయాలి. ఎక్కువ ఎవరు ఫిట్ చేస్తే వాళ్లకి పవర్ బాక్స్ లభిస్తుందని చెప్పాడు ఈ టాస్క్‌కి సంచాలకులుగా రతిక, ప్రియాంకలను నియమించగా బుడగలు ఫిట్ చేసేందుకు అర్జున్, యావర్ చెరో టీమ్ నుంచి పోటీ పడ్డారు. ఈ గేమ్‌లో వీర సింహాలు గెలిచినట్లు చెప్పారు.దీంతో వారికి పవర్ బాక్స్ కీ పంపించాడు బిగ్‌బాస్.

Also Read:కివీస్ హ్యాట్రిక్ ఓటమి..

అందులో ఒక లెటర్ కూడా ఉంది. మొదటి పవర్ బాక్స్‌లో మీకు లభిస్తున్న పవర్ ఏంటంటే మీ ఆపోజిట్ టీమ్ నుంచి ఒకరిని గేమ్ నుంచి తీసేయాలి అని వారు ఇక టాస్కుల్లో పాల్గొనడం కానీ, స్ట్రాటజీ కానీ చేయడానికి వీల్లేదు.. ఎప్పుడూ డెడ్ బోర్డ్ వేసుకొని ఉండాలి అంటూ షాకిచ్చాడు. దీంతో అంతా చర్చించి ప్రశాంత్‌ని తప్పించాడు. ఈ సందర్భంగా ప్రశాంత్‌కు ధైర్యం చెప్పారు శివాజీ.

- Advertisement -